Homeఆంధ్ర ప్రదేశ్టీచర్ ను కొట్టిన టిడిపి ఎమ్మెల్యే...!

టీచర్ ను కొట్టిన టిడిపి ఎమ్మెల్యే…!

  • ఉపాధ్యాయుడిని ఇంటికి పిలిచి కొట్టారంటూ ఫిర్యాదు

  • తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడిపై సొంత పార్టీ నేత ఫిర్యాదు

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో చాలామంది ఎమ్మెల్యేలపై వివాదాస్పద ముద్ర ఉంది. అటువంటి వారిలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ముందు వరసలో ఉంటారు. అనూహ్యంగా తిరువూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన వరుస వివాదాల్లో చిక్కుకుంటూ వస్తున్నారు.

సొంత పార్టీ వారితో పాటు ప్రత్యర్థుల పైన ఆయన విరుచుకుపడే తీరు వివాదాస్పదం అవుతూ వస్తోంది. ఎప్పటికప్పుడు హై కమాండ్ హెచ్చరిస్తూ వస్తోంది. అయితే గత కొన్ని నెలలుగా సైలెంట్ గా ఉన్న ఆయన.. ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ ఉపాధ్యాయుడిని ఇంటికి పిలిపించి కొట్టారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై టిడిపి హై కమాండ్ కు ఫిర్యాదు కూడా అందినట్లు తెలుస్తోంది.

  • పార్టీ అధ్యక్షుడికి ఫిర్యాదు..

రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కొలికపూడి ఓ వ్యాయామ ఉపాధ్యాయుడను ఇంటికి పిలిపించి దుర్భాషలాడారని.. కర్రతో కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈనెల 25న విస్సన్నపేట మండలం నరసాపురం జడ్పీ హైస్కూల్లో పనిచేస్తున్న మెరుగు రమేష్ ను ఇంటికి పిలిపించుకొని.. పాఠశాలలో నిర్వహించిన ఆటల పోటీలకు తనను ఆహ్వానించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

హెచ్ఎం తో పాటు పిఈటిని తీవ్రంగా తిట్టారని.. బాధితులు చాలా బాధపడుతున్నారంటూ బాలకోటయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు.మరోవైపు ఎమ్మెల్యే కొలికపూడి ఈ వ్యాఖ్యలను ఖండించారు.

  • వివాదాలు కొత్త కాదు..

కొలికపూడి శ్రీనివాసరావు వివాదాల్లో చిక్కుకోవడం కొత్త కాదు. అధికారంలోకి వచ్చిన వెంటనే తిరువూరు వైసిపి నేత ఇంటిపై దండయాత్ర చేశారు. మరోవైపు సొంత పార్టీ శ్రేణులు సైతం ఆయన పై అధిష్టానానికి ఫిర్యాదులు చేశాయి. మహిళా ఉద్యోగుల పట్ల అనుచిత ప్రవర్తన చేశారన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి.

అన్నింటికీ మించి విజయవాడ ఎంపీ కేసినేని చిన్నితో ఆయనకు విభేదాలు పతాక స్థాయికి చేరాయి. సోషల్ మీడియా వేదికక బాహటంగానే తిరువూరు ఎమ్మెల్యే ఆరోపణలు చేశారు. దీంతో అధిష్టానం పిలిపించి మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

అయినా సరే ఆయన వైఖరిలో మార్పు రావడం లేదు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. మరి తాజా ఫిర్యాదుతో హై కమాండ్ కొలికపూడిపై ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తుందో చూడాలి.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు