Homeతెలంగాణరేవంత్ కీ రోల్...!

రేవంత్ కీ రోల్…!

  • కాంగ్రెస్ ను జాతీయస్థాయిలో సమన్వయం చేసే బాధ్యత

  • విపక్షాల ఐక్యతకు ప్రయత్నం

  • రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు కంకణం

  • ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా బిజెపి పై ఫైట్

  • ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ పైనే గురి

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా ఢిల్లీ వెళ్లి సౌండ్ చేస్తున్నారు. ఢిల్లీ వేదికగా చేస్తున్న ఆయన ప్రకటనలు సంచలనంగా మారుతున్నాయి. బిజెపికి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో సైతం చర్చకు దారితీస్తున్నాయి.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓ ఐదారు రాష్ట్రాలు ఉన్నాయి. కానీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రేవంత్ అంత సాహసం చేయడం లేదు. ఏకంగా ఢిల్లీకి వెళ్లి మోదీ విధానాలను తప్పుపడుతూ ఫైర్ అవుతున్నారు రేవంత్.

బిజెపికి వ్యతిరేకంగా రేవంత్ పోరుబాట పట్టడమే కాదు.. సైమన్ గో బ్యాక్ తరహాలో సర్ గో బ్యాక్ అంటూ ఉద్యమం రావాలి అంటూ పిలుపునిచ్చారు. ప్రజలంతా ఏకం కావాలని.. విపక్షాలంతా ఐక్యతకు ముందుకు రావాలని రేవంత్ చేసిన సూచన ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

ప్రతి నెల ఢిల్లీ బాట పడుతున్నారు రేవంత్. అక్కడకు వెళ్లిన ప్రతిసారి బిజెపికి వ్యతిరేకంగా.. నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తన దూకుడును ప్రదర్శిస్తున్నారు.

  • దూకుడు తోనే అందలం..

రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణం ఒక్కసారి పరిశీలిస్తే.. ఆయన ఏబీవీపీ కార్యకర్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. తరువాత సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలంగాణలో కెసిఆర్ వ్యతిరేక శక్తులను ఏకీకృతం చేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు.

రాజకీయంగా కొన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా తన మూడేళ్ల పాలనను తెలంగాణలో పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు అదే రేవంత్ జాతీయస్థాయిలో దూకుడు ప్రదర్శిస్తుండడం, విపక్షాలు ఐక్యంగా ఉండాలని పిలుపునివ్వడం ద్వారా ఢిల్లీ వేదికగా కూడా పొలిటికల్ సౌండ్ చేయబోతున్నారు అనేది స్పష్టంగా తెలుస్తోంది.

  • ఏ సీఎం చేయని విధంగా..

దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కర్ణాటక సీఎం గా ఉన్న డీకే శివకుమార్ రేవంత్ రెడ్డి కంటే సీనియర్. పైగా కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరు ఉంది. అటువంటి నాయకుడు కూడా ఢిల్లీ వెళ్లి ఎటువంటి రాజకీయ వ్యాఖ్యలు చేయడం లేదు. కే

రళ ముఖ్యమంత్రి కూడా ఈ తరహాలో మాట్లాడడం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ ప్రతి రాష్ట్రంలో ఓటు బ్యాంకు ఉంది. కానీ వారిలో జవసత్వాలు నింపి బయటకు తెచ్చే నేతలు లేకుండా పోతున్నారు.

కాంగ్రెస్ అగ్ర నేతలుగా ఉన్న రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాలు ఆశించిన స్థాయిలో పరిణితి సాధించలేకపోతున్నారు. వారి స్థాయి వరకు దూకుడు ప్రదర్శిస్తున్నారు. అయితే వారి చుట్టూ ఇప్పుడు బలమైన సమన్వయం చేసే నేతలు లేరు. ఇప్పుడు ఆ బాధ్యతలను తీసుకున్నట్టు ఉన్నారు రేవంత్ రెడ్డి.

  • జాతీయ రాజకీయాల్లోకి..

2028 ఎన్నికల్లోను మరోసారి తాను తెలంగాణ ముఖ్యమంత్రిని అవుతాను అంటూ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసిన తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి పోతానంటూ వ్యాఖ్యానించారు. అయితే తెలంగాణ రాష్ట్రానికి ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతాను అంటూ సన్నిహితుల వద్ద గతంలో చెప్పారు.

అనుకున్నట్టుగానే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే జాతీయస్థాయిలో రాహుల్ గాంధీ ఇమేజ్ ను పెంచి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చే సమన్వయ బాధ్యతను రేవంత్ తీసుకున్నట్టు కనిపిస్తున్నారు.

ఒకవైపు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తూ.. ఇంకోవైపు ఎప్పటికప్పుడు ఢిల్లీ వెళ్తూ కీలక ప్రకటనలు చేస్తున్నారు. కచ్చితంగా దీని వెనుక రేవంత్ వ్యూహం ఉన్నట్లు అర్థం అవుతోంది. మరి ఆయన అనుకున్న దాంట్లో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు