Homeక్రైమ్హోట‌ల్ గ‌దిలో మ‌హిళ దారుణ హ‌త్యా...! నిందితుడు ప‌రార్‌...

హోట‌ల్ గ‌దిలో మ‌హిళ దారుణ హ‌త్యా…! నిందితుడు ప‌రార్‌…

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: అమీర్‌పేట‌లోని ఓ హోట‌ల్ గ‌దిలో మంగ‌ళ‌వారం మ‌హిళ దారున హ‌త్య‌కు గురైంది. ప్రియురాలు శిరీష‌(34)ను ప్రియుడు శ్రీ‌నివాస్ ఓ రాడ్డుతో కొట్టి చంపేశాడు. అనంత‌రం గ‌దికి తాళం వేసి ప‌రార‌య్యాడు. దీంతో ఎసా్స‌ర్‌న‌గ‌ర్ పోలీసులు కేసు న‌మోదు తీవ్రంగా గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం నాగసమందర్ గ్రామానికి చెందిన బి. శిరీష (34) ఎస్బీఐ కస్టమర్ సర్వీస్ పాయింట్‌ను ఆమె నిర్వహిస్తోంది. గ‌తంలో 2013లో శిరీషకు వివాహం జరిగింది. దీంతో మనస్పర్థల కారణంగా 2016లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం ఓగ్లాపూర్‌కు చెందిన శ్రీనివాస్ (38)తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే శ్రీనివాస్‌ను పెళ్లి చేసుకుంటానని తన కుటుంబ సభ్యులకు మహిళ చెప్పింది. కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో వారు గుడిలో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. పెళ్లి అయ్యాక తన తల్లిదండ్రుల వద్దే శిరీష ఉంటున్నారు. అప్పుడప్పుడూ హైదరాబాద్‌కు వచ్చి హోటల్‌లోవారు కలుసుకునేవారు.

అయితే, ప్రియురాలు శిరీష, ప్రియుడు శ్రీనివాస్ కలిసి అమీర్‌పేటలోని ఓ హోటల్‌లో బస చేశారు. ఈ నెల 24వ తేదీన గణేశ్, దుర్గా అనే మారుపేర్లతో రూం తీసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున శ్రీనివాస్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. ఉదయం తొమ్మిది గంటలు దాటినా శిరీష బయటకు రాకపోవడంతో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చింది.ఈ క్రమంలో మరో తాళంతో వారు ఉన్న గదిని పరిశీలించగా బెడ్‌పై శిరీష మృతదేహం కనిపించింది. ఓ రాడ్డుతో ఆమెను విచక్షణారహితంగా అతడు కొట్టడంతో మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గదిలో టీవీ శబ్దం పెంచి దాడి చేసినట్లుగా అనుమానిస్తున్నారు. మహిళ శరీరంపై పలు చోట్ల గాయాలను గుర్తించారు. ఈ హత్య అనంతరం ఆమె వద్ద ఉన్న డబ్బును నిందితుడు తీసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు రెండు రోజుల ముందే ప్రియురాలిపై ప్రియుడు దాడి చేశాడు.

ఈ దాడి అనంతరం ఎల్లారెడ్డిగూడలోని ఆస్పత్రిలో ఆమెకు చికిత్స చేయించాడు. ఆస్పత్రిలోనూ మారుపేర్లతో వారు వివరాలు నమోదు చేసినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్‌పై గతంలోనూ యువతులను వేధించిన కేసులు నమోదైనట్లు సమాచారం. నిందితుడు శ్రీనివాస్ కోసం ఎస్సార్‌నగర్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనాస్థలాన్ని డీసీపీ, ఏసీపీ, ఇన్‌స్పెక్టర్ పరిశీలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు