Homeఆంధ్ర ప్రదేశ్బాలిక‌పై రిటైర్డ్ ఉద్యోగి అత్యాచార‌య‌త్నం...! కేసు న‌మోదు...

బాలిక‌పై రిటైర్డ్ ఉద్యోగి అత్యాచార‌య‌త్నం…! కేసు న‌మోదు…

ఒంగోలు, క్రైమ్‌మిర్ర‌ర్‌: ఒంగోలు జిల్లాలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ రిటైర్డ్ ఉద్యోగి బాలికల‌పై అత్యాచార‌య‌త్నం చేసిన ఘ‌ట‌న ఆ ప్రాంతంలో క‌ల‌క‌లం రేపింది. ఓ వ‌స‌తి గృహంలో ఉంటున్న బాలిక‌ల‌ను తండ్రి డెత్ స‌ర్టిఫికేట్ ఇప్పిస్తాన‌ని న‌మ్మించి హాస్ట‌ల్ నుంచి వంట మ‌నిషి బ‌య‌ట‌కు తీసుకొచ్చింది. ఈ క్ర‌మంలో బాలిక‌ను రిటైర్డ్ ఉద్యోగి వ‌ద్ద వంట మ‌నిషి వ‌దిలిపెట్టి వెళ్లింది. దీంతో బాలిక‌ల‌ను ఇంట్లో బందించి అత్యాచార‌య‌త్నం చేసిన‌ట్లు తెలిసింది.

కాగా బందువుల‌కు మ‌రో బాలిక ఫోన్ చేసి స‌మాచారం ఇచ్చింది. దీంతో బందువుల‌కు పోన్ చేయ‌డంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. అత‌డి ఇంటిలో ఉన్న మ‌రో బాలిక‌ను బందువులు వ‌చ్చి కాపాడారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు. రిటైర్డ్ ఉద్యోగిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. డీఆర్డీఏలో పనిచేసి అతడు రిటైర్ అయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ఒంగోలు పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. హోట‌ల్ గ‌దిలో మ‌హిళ దారుణ హ‌త్యా…! నిందితుడు ప‌రార్‌…
  2. తుదిశ్వాస విడిచిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్!
  3. బీఆర్ఎస్‌లో భగ్గుమన్న అంతర్గత విభేదాలు.. కేటీఆర్‌కు కవిత తీవ్ర హెచ్చరిక!
  4. శ్రీశైలం ప్రాజెక్టులో అడుగంటుతున్న నీటి నిల్వలు.. ఆందోళనలో అధికారులు

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు