క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మైదానంలో కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేయడం ఎంతో సరదాగా ఉంటుందని రోహిత్ తన అనుభవాలను పంచుకున్నారు. క్రీజులో ఇద్దరం కలిసి ఆడుతున్నప్పుడు.. ప్రత్యర్థి బౌలర్లపై ఎవరు అటాక్ చేయాలి అనే విషయాలపై ఎప్పటికప్పుడు చర్చించుకుంటామని ఆయన తెలిపారు.
సీఐఎస్ఎఫ్ క్యాంప్‌లో కాల్పులు.. నలుగురు సిబ్బంది మృతి
ఒకవేళ ఆట మధ్యలో తన కాలికి ఏదైనా ఇబ్బంది తలెత్తితే, పరిస్థితులను అర్థం చేసుకుని అందుకు తగ్గట్లుగా విరాట్ వెంటనే తన ఆటతీరును మార్చుకుంటాడని రోహిత్ కొనియాడారు. గతం నుంచి చూసుకుంటే కోహ్లీలో అసలు ఎలాంటి మార్పు రాలేదని, అప్పటికైనా ఇప్పటికైనా అతడు ఒకేలా ఉన్నాడని స్పష్టం చేశారు.గతంలో విరాట్ కోహ్లీ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఎంతటి పరుగుల దాహంతో ఉండేవాడో, ఇప్పుడు తాను కెప్టెన్ అయ్యాక కూడా అదే కసితో ఆడుతున్నాడని రోహిత్ శర్మ ప్రశంసించారు. దేశం కోసం మ్యాచ్‌లు గెలవాలన్న పట్టుదల తప్ప కోహ్లీలో మరే ఇతర ఆలోచన ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఆటలో తాము ఎప్పుడూ ఒకరికొకరు అండగా నిలుస్తూ, పూర్తి మద్దతు ఇచ్చుకుంటామని రోహిత్ శర్మ ఈ సందర్భంగా వెల్లడించారు.
మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు.. ఇద్దరు నిందితుల అరెస్ట్
