Homeక్రీడలుఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఏమైంది? వన్డేల్లో డిఫెండింగ్ ఛాంపియన్ల పేలవ ప్రదర్శనపై ఆందోళన!

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఏమైంది? వన్డేల్లో డిఫెండింగ్ ఛాంపియన్ల పేలవ ప్రదర్శనపై ఆందోళన!

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- 2026 సంవత్సరంలో వన్డే క్రికెట్‌లో ఆస్ట్రేలియా మెన్స్ టీమ్ ప్రదర్శన అత్యంత పేలవంగా, ఆందోళనకరంగా సాగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా సిరీస్‌తో కలుపుకొని ఆస్ట్రేలియా జట్టు మొత్తం నాలుగు వన్డేల్లో మూడు సార్లు పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి జట్ల చేతిలో కూడా సీరిస్‌లను కోల్పోయి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.

లెక్కలడిగిన వార్డు మెంబర్.. రెచ్చిపోయిన సర్పంచ్…!

జింబాబ్వేతో జరిగిన సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్నప్పటికీ, ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఉన్నత స్థాయికి ఆ జట్టు సరైన ప్రతి ప్రత్యర్థి కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక రాబోయే నవంబర్ నెలలో ఇంగ్లండ్‌తో ఆస్ట్రేలియా జట్టు 3 వన్డేల సిరీస్‌లో తలపడనుంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది జరగనున్న 2027 వన్డే ప్రపంచ కప్ (WC 2027) నాటికైనా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగే ఆస్ట్రేలియా జట్టు మళ్లీ గాడిలో పడుతుందో లేదో వేచి చూడాలి. ఆస్ట్రేలియా జట్టు తమ పూర్వవైభవాన్ని సంతరించుకోవడానికి రాబోయే మ్యాచ్‌లలో భారీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఓయో గదిలో ప్రియురాలి హత్య కేసు: నిందితుడికి రిమాండ్

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు