Homeతెలంగాణలెక్కలడిగిన వార్డు మెంబర్.. రెచ్చిపోయిన సర్పంచ్...!

లెక్కలడిగిన వార్డు మెంబర్.. రెచ్చిపోయిన సర్పంచ్…!

  • లెక్కలడిగిన వార్డు మెంబర్.. రెచ్చిపోయిన కొండూరు సర్పంచ్.

  • పీకుతవా అంటూ గ్రామ పంచాయతీలో రచ్చ

  • దాడికి ప్రయత్నం.. కేసు పెడుతానని బెదిరింపులు!?

  • గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం అంటూ ఆరోపణలు.

మర్రిగూడ (క్రైమ్ మిర్రర్): గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై, కొండూరు గ్రామస్తులు సర్పంచ్ పై విరుచుకు పడ్డారు. ఈ క్రమంలో నాలుగవ వార్డు మెంబర్ నవీన్, గ్రామ పంచాయతీలో సర్పంచ్ సీతారాం నాయక్ ను ప్రశ్నించారు. పంచాయతీ నిధులు అడ్డగోలుగా డ్రా చేస్తున్నారని.. లెక్కలు చెప్పాలని నిలదీశారు.!?

ఈ క్రమంలో సర్పంచ్ కోపంతో ఊగిపోయి, వార్డు మెంబర్ నవీన్ పై దాడికి ప్రయత్నం చేయబోయినట్లు సమాచారం.!? ఈ ఘటనను వీడియో తీసిన గ్రామస్తులు, సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ వీడియోలో సర్పంచ్ మాట్లాడే విధానం, దురుసు తనం ఆ హోదాకు భిన్నంగా ఉన్నట్లు, ఒక గ్రామ ప్రధమ పౌరుడు మాట్లాడే విధానం ఇది కాదని, వీడియో చూసిన చాలా మంది సర్పంచ్ తీరుపై మండిపడుతున్నారు. అందరికీ జవాబుదారిగా ఉండాల్సిన సర్పంచ్, అడిగిన వారిపై చిరెత్తిపోవడం పీకుతవా అంటూ దురుసుగా ప్రవర్తించడంపై స్థానికులు గుర్రుమంటున్నారు.

  • నిధుల దుర్వినియోగంపై అధికారులకు ఫిర్యాదు చేస్తాం- వార్డు మెంబర్ నవీన్

మర్రిగూడ మండలంలోని మేజర్ గ్రామపంచాయతీలతో పోటీపడి, జరిగని పనులకు దొంగ బిల్లులతో పంచాయతీ నిధులను దుర్వినియోగం చేస్తున్న, గ్రామ సర్పంచ్ సీతారాం నాయక్ పై చర్యలు తీసుకోవాలని వార్డు మెంబర్ నవీన్ కోరారు. ఇప్పటికే లక్షల్లో ప్రభుత్వ సొమ్మును డ్రా చేసినట్లు ఆయన ఆరోపించారు.

నిజాయితీగా ఖర్చు చేసి ఉంటే ప్రజలకు లెక్కలు ఎందుకు చెప్పడం లేదన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో సర్పంచ్ గా ఎన్నుకుంటే, వెన్నుపోటు పొడవటం సరికాదన్నారు. లెక్కలు అడిగిన వారిపై దాడికి ప్రయత్నం చెయ్యడమే కాకుండా, నోటికి వచ్చిన బూతులు తిట్టడంతో పాటు తప్పుడు ప్రచారాలు చేస్తూ, కేసు పెడుతానని బెదిరిస్తున్నాడని నవీన్ ఆరోపించారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంటూ పంచాయతీ నిధులపై లెక్కలు అడిగే హక్కు లేకుండాపోయిందన్నారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని విచారణ చేపట్టి, పంచాయతీ నిధుల అవకతవకలపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు