Homeతెలంగాణఅర్ధరాత్రి 3 గంటల వరకు భారీ శబ్దాలు.. పోలీసులకు అల్లు శిరీష్ ఫిర్యాదు

అర్ధరాత్రి 3 గంటల వరకు భారీ శబ్దాలు.. పోలీసులకు అల్లు శిరీష్ ఫిర్యాదు

హైదరాబాద్‌లో శబ్ద కాలుష్యంపై సినీ నటుడు అల్లు శిరీష్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. రాత్రి వేళల్లో అధిక శబ్దంతో సంగీతం వినిపిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా హైదరాబాద్ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

షేక్‌పేట్‌లోని అపర్ణా వన్ అపార్ట్‌మెంట్‌లో తాను నివసిస్తున్నట్లు అల్లు శిరీష్ వెల్లడించారు. తమ నివాసానికి సమీపంలోని వినోభానగర్ హనుమాన్ ఆలయం వద్ద గత కొన్ని రోజులుగా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా భారీ శబ్దంతో సంగీతం వినిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో రాత్రి 2, 3 గంటల వరకు కూడా శబ్దాలు కొనసాగుతున్నాయని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.

ఈ సమస్యపై ఇప్పటికే ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు అల్లు శిరీష్ చెప్పారు. అయితే గణేష్ నిమజ్జనం పూర్తయ్యే వరకు సహకరించాలని పోలీసులు సూచించినట్లు తెలిపారు. నిమజ్జనం కార్యక్రమం ముగిసినప్పటికీ శబ్దాల సమస్య కొనసాగుతోందని, అందుకే మరోసారి పోలీసుల దృష్టికి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు.

అధిక శబ్దాల కారణంగా తమ అపార్ట్‌మెంట్‌లోని వృద్ధులు, చిన్నారులతో పాటు ఉదయం ఉద్యోగాలకు వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారని శిరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై గతంలో కూడా పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు.

రాత్రి వేళల్లో శబ్ద కాలుష్యంతో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సిటీ పోలీసులను అల్లు శిరీష్ కోరారు.

also read: లిక్కర్ షాపులోకి కోతి.. మద్యం తాగి అక్కడే మత్తులో నిద్ర! వైరల్‌గా మారిన ఘటన

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు