Homeసినిమాఎంజీఆర్‌ జీవిత కథతో ‘పురట్చి తలైవర్‌’.. హీరోగా జేఎం. బషీర్‌

ఎంజీఆర్‌ జీవిత కథతో ‘పురట్చి తలైవర్‌’.. హీరోగా జేఎం. బషీర్‌

తమిళనాడు రాజకీయాలు, సినీ రంగంపై చెరగని ముద్ర వేసిన మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు ఎంజీఆర్‌ (ఎం.జి. రామచంద్రన్‌) జీవిత కథ వెండితెరపైకి రాబోతోంది. ఆయన జీవిత ప్రయాణాన్ని ఆధారంగా చేసుకుని ‘పురట్చి తలైవర్‌’ పేరుతో బయోపిక్‌ను తెరకెక్కించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది.

ఎంజీఆర్‌ పాత్రలో నటుడు జేఎం. బషీర్‌ కనిపించనున్నారు. ఆయన రంగస్థల ప్రస్థానం నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టడం, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడం, అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించడం వంటి కీలక అంశాలను ఈ చిత్రంలో చూపించనున్నారు.

అలాగే డీఎంకేలో ఎంజీఆర్‌ రాజకీయ ప్రస్థానం, ఆ పార్టీతో ఏర్పడిన అనుబంధం, 1972లో అన్నాడీఎంకేను స్థాపించిన సందర్భం వంటి ముఖ్యమైన ఘట్టాలకు కూడా కథలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఎన్నికల్లో విజయం సాధించి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే వరకు ఆయన సాగించిన రాజకీయ ప్రయాణాన్ని బయోపిక్‌లో ఆవిష్కరించనున్నారు.

ఎంజీఆర్‌ సినీ, రాజకీయ జీవితంలోని కీలక మలుపులను ప్రేక్షకులకు పరిచయం చేసేలా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ బయోపిక్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలను అక్టోబర్‌ 17న రామవరం తోటలో నిర్వహించనున్నారు. అదే కార్యక్రమంతో సినిమా నిర్మాణం అధికారికంగా ప్రారంభం కానుంది.

ఎంజీఆర్‌ జీవితంలో సినీ రంగం, రాజకీయ రంగం రెండింటిలోనూ చోటుచేసుకున్న ముఖ్య పరిణామాలను తెరపై ఎలా చూపించనున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

also read: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో హీరో వరుణ్ తేజ్ ప్రత్యేక పూజలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు