Homeసినిమాకొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో హీరో వరుణ్ తేజ్ ప్రత్యేక పూజలు

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో హీరో వరుణ్ తేజ్ ప్రత్యేక పూజలు

ప్రముఖ సినీ నటుడు వరుణ్ తేజ్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆదివారం ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు.

ఆలయానికి వచ్చిన వరుణ్ తేజ్‌కు ఈవో అంజనా రెడ్డి, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన గోత్రనామాలపై అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని పలు కార్యక్రమాల్లో వరుణ్ తేజ్ పాల్గొన్నారు.

పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం ఆలయ ప్రాకారమండపంలో వరుణ్ తేజ్‌ను స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. వేదమంత్రాల నడుమ ఆలయ అర్చకులు, వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందించారు.

వరుణ్ తేజ్ కొండగట్టు ఆలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు, భక్తులు ఆయనను చూసేందుకు ఆసక్తి చూపించారు.

also read: రామాపురంలో ‘పల్లె పండుగ 3.0…! 29న చంద్రబాబు, పవన్ రాక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు