Homeఆంధ్ర ప్రదేశ్ఏపీ ఓటర్ల విచారణ దాదాపు పూర్తి: 42 లక్షల మందికి అర్హత, అక్టోబర్ 9న తుది...

ఏపీ ఓటర్ల విచారణ దాదాపు పూర్తి: 42 లక్షల మందికి అర్హత, అక్టోబర్ 9న తుది జాబితా!

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో SIRలో భాగంగా ఎన్నికల సంఘం (EC) చేపట్టిన ఓటర్ల విచారణ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఈ విచారణలో భాగంగా నోటీసులు అందుకున్న మొత్తం 44,24,411 మంది ఓటర్లపై EC పరిశీలన జరిపింది. వీరిలో ఏకంగా 42,01,092 మందిని అర్హులైన ఓటర్లుగా గుర్తించగా, 1,66,279 మందిని అనర్హులుగా నిర్ధారించింది.ప్రస్తుతం మరో 57,040 మంది ఓటర్ల ఆధారాలు ఇంకా పరిశీలనలో ఉండగా, 4,434 మంది విచారణ పెండింగ్‌లోనే ఉంది. మరోవైపు కొత్త ఓటర్ల నమోదు కోసం వచ్చిన ఫారం-6 దరఖాస్తులు 85,736, అలాగే ఓటర్ల వివరాల్లో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు వచ్చిన ఫారం-8 దరఖాస్తులు 40,991 పెండింగ్‌లో ఉన్నాయి. ఈ దరఖాస్తులు మరియు పెండింగ్ విచారణలన్నీ త్వరలో పూర్తి చేసి, అక్టోబర్ 9వ తేదీన ఓటర్ల తుది జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు.

కుమార్తె జ్ఞాపకార్థం తండ్రి అపురూప కానుక.. రూ.2 లక్షలతో గుడి నిర్మాణం

జగిత్యాలలో ఏసీబీ వలలో సీడీపీవో.. 21 మంది సూపర్‌వైజర్ల నుంచి రూ.63 వేల లంచం!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు