క్రైమ్ మిర్రర్ : ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాలో మూఢనమ్మకాల పేరుతో ఓ బాలికపై అరాచకానికి పాల్పడిన ఘోర ఉదంతం వెలుగుచూసింది. అనారోగ్యంతో ఉన్న తన 13 ఏళ్ల కుమార్తెను నయం చేయిద్దామని ఆశతో ఓ తల్లి తాంత్రికుడి వద్దకు తీసుకెళ్లగా, ఆ వ్యక్తి బాలికపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. నరైని ప్రాంతానికి చెందిన సదరు మహిళ, తన బిడ్డ అనారోగ్యం తగ్గకపోవడంతో క్షుద్రపూజలు చేసే 55 ఏళ్ల పరశురామ్ యాదవ్ అనే మంత్రగాడిని ఆశ్రయించింది. పూజల సాకుతో వ్యాధిని పూర్తిస్థాయిలో నయం చేస్తానని నమ్మించిన అతడు, బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి చెందిన తల్లి, కుమార్తెతో కలిసి బిసాండా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. పరారీలో ఉన్న మిలౌలి గ్రామానికి చెందిన పరశురామ్ యాదవ్‌ను శుక్రవారం సాయంత్రం పావారి గ్రామం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు తాంత్రికుడిపై పోక్సో (POCSO) సహా పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు అధికారులు స్పష్టం చేశారు.
also read : నకిలీ పోలీస్ దారుణం.. దివ్యాంగ యువకుడిని రైలు నుంచి తోసేసి హత్య
