అన్నమయ్య జిల్లాలోని కురబలకోట మండలం చేనేత నగర్ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భవన నిర్మాణ పనులకు వెళ్తున్న కార్మికులతో ప్రయాణిస్తున్న ఐచర్ వాహనాన్ని ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న 12 మంది కార్మికులు గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను బయటకు తీసుకువచ్చారు. అనంతరం సమాచారం అందుకున్న సిబ్బంది గాయపడిన వారిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వారికి చికిత్స అందించారు.
ప్రమాదానికి దారితీసిన కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై సంబంధిత అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
also read: రీ-రిలీజ్లో ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ ఎన్కోర్’ సరికొత్త రికార్డు.. ‘బాహుబలి’ని దాటేసింది!
