విశాఖపట్నంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న శైలజ అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. రామ్‌నగర్ ప్రాంతానికి చెందిన శైలజ… ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది.
ఫ్యాన్‌కు ఉరేసుకున్న స్థితిలో ఆమెను కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థిని ఆత్మహత్యకు చదువుకు సంబంధించిన ఒత్తిడి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా సమాచారం. అయితే అసలు కారణాలు ఏమిటనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ ఘటనతో శైలజ కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
also read: ఖమ్మంలో విషాదం.. గణేశ్ నిమజ్జన వేళ ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్, రెండేళ్ల బాలుడు మృతి
