Homeక్రైమ్ఖమ్మంలో విషాదం.. గణేశ్ నిమజ్జన వేళ ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్, రెండేళ్ల బాలుడు మృతి

ఖమ్మంలో విషాదం.. గణేశ్ నిమజ్జన వేళ ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్, రెండేళ్ల బాలుడు మృతి

గణేశ్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ఖమ్మం నగరంలో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోవడం విషాదానికి దారితీసింది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న రెండేళ్ల బాలుడు వైభవ్ నాయక్‌ను తల్లిదండ్రులు అత్యవసరంగా ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో వాహనం ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. పరిస్థితి విషమించడంతో బాలుడి తండ్రి తన కుమారుడిని భుజాలపై ఎత్తుకుని ఆస్పత్రి వైపు పరుగులు తీశాడు.

గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న వైభవ్ నాయక్‌ను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు బయలుదేరారు. అయితే గణేశ్ శోభాయాత్ర కారణంగా నగరంలోని రహదారులపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వారు ప్రయాణిస్తున్న వాహనం ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది.

బాలుడి పరిస్థితి మరింత విషమించడంతో తండ్రి ఆలస్యం చేయకుండా అతడిని భుజాలపై మోసుకుని ఆస్పత్రికి పరుగులు తీశాడు. అయితే ఆస్పత్రికి చేరుకునే సమయానికి బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటనతో బాలుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గణేశ్ శోభాయాత్ర సమయంలో ఏర్పడిన ట్రాఫిక్ కారణంగా చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

also read: కీరా దోసకాయతో కండోమ్ డెమో.. బీహార్ బయాలజీ టీచర్ వీడియో వైరల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు