Homeఆంధ్ర ప్రదేశ్విదేశాలకు సీఎం చంద్రబాబు...! డిప్యూటీ సీఎం పవన్ క‌ళ్యాణ్‌కు బాధ్య‌త‌లు...?

విదేశాలకు సీఎం చంద్రబాబు…! డిప్యూటీ సీఎం పవన్ క‌ళ్యాణ్‌కు బాధ్య‌త‌లు…?

  • మూడు రోజులపాటు కుటుంబంతో టూర్
  • ప్రైవేటు కార్యక్రమం కావడంతో షెడ్యూల్ ప్రకటించని ప్రభుత్వం

 

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్ళనున్నారు. ఈనెల 25న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మూడు రోజులపాటు విదేశాల్లో గడపనున్నారు. అధికారిక వ్యవహారాలతో ఎలాంటి సంబంధం లేకుండా.. పూర్తిగా వ్యక్తిగత పర్యటన కావడంతో ముఖ్యమంత్రితో పాటు ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే ఈ టూర్లో పాల్గొంటున్నారు. నిరంతరం సమీక్షలు, జిల్లాల పర్యటనలు, ప్రజా సమస్యల పరిష్కారంలో బిజీగా గడుపుతుంటారు చంద్రబాబు. అందుకే కొద్ది రోజులపాటు కుటుంబంతో గడిపేందుకు ఈ చిన్న విరామాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే ఇది వ్యక్తిగత పర్యటన కావడంతో షెడ్యూల్ మాత్రం బయటకు రాలేదు.

వివరాలు బయటకు రాలే…

ప్రతి సంవత్సరం సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలకు వెళుతుంటారు. అయితే తాజా పర్యటన పూర్తిగా ప్రైవేటు వ్యవహారం కావడంతో సీఎం ఏ దేశానికి వెళుతున్నారు? ఎక్కడ బస చేయనున్నారు అనే షెడ్యూల్ వివరాలను అధికార యంత్రాంగం అత్యంత గోప్యంగా ఉంచింది. ఎలాంటి అధికారిక ప్రోటోకాల్స్, ప్రభుత్వ ప్రతినిధి బృందాలు లేకుండా కేవలం వ్యక్తిగత సిబ్బంది పర్యవేక్షణలోనే ప్రయాణ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రైవేటు టూర్ కారణంగా ఎలాంటి బహిరంగ సమావేశాలు, రాజకీయ భేటీలు ఉండవని.. కేవలం కుటుంబ సభ్యులతో గడిపేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారని సమాచారం.

28న తిరిగి అమరావతికి…

అయితే చంద్రబాబు విదేశీ పర్యటనకు సంబంధించి కేవలం ఆయన భార్య భువనేశ్వరి మాత్రమే పరిమితం అవుతారా? లేకుంటే కొడుకు లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనువడు దేవాన్స్ కూడా వెళ్తారా? అన్నది మాత్రం తెలియడం లేదు. సీఎం చంద్రబాబు మూడు రోజుల విదేశీ పర్యటనను ముగించుకొని ఈ నెల 28న తిరిగి అమరావతికి చేరుకోనున్నారు. తిరిగి వచ్చిన వెంటనే ఆయన యధావిధిగా ప్రభుత్వ పాలనా సమీక్షలు, ప్రాజెక్టుల పురోగతి పరిశీలనలు, మంత్రివర్గ కార్యచరణలో భాగస్వామ్యం కానున్నారు. వరుసగా ఐదు రోజులపాటు జిల్లాల్లో పర్యటించనున్నారు.

మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మళ్లీ అధికారిక కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. కొద్దిరోజులపాటు కేరళలో ప్రత్యేక ప్రకృతి వైద్యం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అధికారిక, రాజకీయ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. ఇటీవల కాకినాడ వేదికగా స్థానిక సంస్థలకు సంబంధించి పార్టీ శ్రేణులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మూడు రోజులపాటు వ్యక్తిగత పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు విదేశాలకు వెళ్తున్నారు. ఈ మూడు రోజులపాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. కానీ ఎంతవరకు అధికారికంగా ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు.

ఇవి కూడ చ‌ద‌వండి:

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు