Homeతెలంగాణడీకే అరుణకు నో ఛాన్స్...! అభిమానుల ఆశలపై నీళ్లు...

డీకే అరుణకు నో ఛాన్స్…! అభిమానుల ఆశలపై నీళ్లు…

  • కేంద్ర మంత్రివర్గంలో అవకాశం లేనట్టే

  • తమిళనాడు సహా ఇన్చార్జిగా నియామకం

 

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: డీకే అరుణ ఆశలపై బిజెపి హై కమాండ్ నీళ్లు చల్లిందా? కేంద్ర క్యాబినెట్లోకి ఆమె ప్రవేశం సాధ్యం కాదా? ఆమెకు చోటు లేనట్టేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా జరిగిన పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు బిజెపి బాధ్యులను నియమించింది హై కమాండ్. పార్టీలో సీనియర్లకు బాధ్యతలు కట్టబెట్టింది. అందులో భాగంగా తమిళనాడు బీజేపీ సహా ఇంచార్జ్గా డీకే అరుణను నియమించింది. దీంతో ఆమెకు మంత్రి పదవి లేనట్టేనని టాక్ నడుస్తోంది. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో తమ అభిమాన నేతకు తప్పకుండా ఛాన్స్ అనుచరులు ఆశలు పెట్టుకున్నారు. కానీ తాజా నియామకం ద్వారా మంత్రివర్గంలో అరుణకు చాన్స్ లేదని తేలిపోయింది.

సహకరించని సమీకరణలు…

2024 సార్వత్రిక ఎన్నికల్లో మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం నుంచి గెలిచారు డీకే అరుణ. అప్పటినుంచి ఆమెకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని అంత భావించారు. కానీ వివిధ సమీకరణలో భాగంగా ఆమెకు ఛాన్స్ ఇవ్వలేదు మోదీ. అయితే మంత్రివర్గ విస్తరణలో ఆమెకు అవకాశం ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగింది. మహిళా కోటాలో ఆమెకు మంత్రి పదవి ఇస్తారన్న టాక్ నడిచింది. కొందరు అభిమానులు అయితే సోషల్ మీడియా వేదికగా ముందుగానే ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అందుకు తగ్గట్టుగానే ఆమెకు జాతీయస్థాయిలో ఉన్న జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి నుంచి తొలగించారు.. మంత్రి పదవి కోసమే ఆమెకు జాతీయ కార్యవర్గం నుంచి తప్పించారన్న టాక్ కూడా నడిచింది. కానీ ఇప్పుడు మరో రాష్ట్రానికి బాధ్యతలు అప్పగించడం ద్వారా మంత్రివర్గంలో స్థానం లేదని తేలిపోయింది. దీంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు.

సుదీర్ఘ నేపథ్యం…

తెలంగాణలో డీకే అరుణ సీనియర్ మోస్ట్ లీడర్. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ఆమెది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. 1996లో మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1998లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానానికి. అయినా సరే ఓటమి ఎదురయింది. 1999లో గద్వాల శాసనసభ స్థానానికి పోటీ చేసిన ఆమెకు ఓటమి తప్పలేదు. ఇలా వరుసగా ఓటములు ఎదురైనా ఆమె వీళ్ళు తిరిగి చూడలేదు. 2004లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. కానీ గద్వాల నుంచి సమాజ్వాది పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు అరుణ. అలా శాసనసభలో అడుగు పెట్టారు. అయితే కాంగ్రెస్ అనుబంధ సభ్యురాలిగా శాసనసభలో ఆమె కొనసాగారు. ఆ కారణంగానే సమాజ్వాది పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. 2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు.

రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి అయ్యారు. 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గద్వాల నుంచి గెలిచారు. హ్యాట్రిక్ విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. అనంతరం ఆమె బిజెపిలో చేరారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఎంపీగా విజయం సాధించారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. విశాఖ సదస్సుకు చంద్రబాబు భారీ ప్లాన్‌…!
  2.  కృత్రిమ పన్నీర్‌పై కొరడా..!
  3. దాయాది దేశానికి డిఫెన్స్ మినిస్టర్ స్ట్రాంగ్ వార్నింగ్..!
  4.  అపోలో హాస్పిటల్స్‌లో ఉపాసనకు బిగ్ రెస్పాన్సిబిలిటీ.. ‘డైరెక్టర్-ప్రాజెక్ట్స్’గా నూతన బాధ్యతలు!

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు