అమెరికా పర్యటన సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అంతర్జాతీయ సంబంధాలపై అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా, అమెరికాలు ఒకదానికొకటి శత్రువులుగా ఉండకూడదని, రెండు దేశాలు బలమైన భాగస్వాములుగా కలసి ముందుకు సాగాలని ఆయన స్పష్టం చేశారు. ఈ రెండు అగ్రదేశాలు ఎంతో గొప్పవని, ఇక్కడి ప్రజలు కూడా ఎంతో గొప్పవారని ఆయన కొనియాడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
రెండు దేశాల నడుమ ఉన్న సంబంధాల ప్రాముఖ్యతను వివరిస్తూ.. గత మే నెలలో డోనాల్డ్ ట్రంప్ చైనాలో పర్యటించిన విషయాన్ని జిన్‌పింగ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ పర్యటన సమయంలో ఇరుదేశాల మధ్య దీర్ఘకాలిక ‘వ్యూహాత్మక స్థిరత్వ బంధాన్ని’ నిర్మించుకోవడానికి తామిద్దరం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు ఆయన వెల్లడించారు.ప్రపంచంలో శాంతి, ఆర్థిక స్థిరత్వం కోసం చైనా, యూఎస్ రెండూ ఒకే దిశలో ప్రయాణించాల్సిన అవసరం ఉందన్నారు. మునుపటి విభేదాలను అధిగమించి, పరస్పర సహకారంతో కలిసి పనిచేయాలని, ప్రపంచ సమస్యల పరిష్కారానికి ఇరుదేశాలు ఒకే మార్గంలో పయనించాలని షీ జిన్‌పింగ్ ఆకాంక్షించారు.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను పదవి నుంచి తొలగించడం ఎలా? రాజ్యాంగ నిబంధనలు ఇవే!
