బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో ఓ యువతికి నడిరోడ్డుపై వేధింపులు ఎదురైన ఘటన కలకలం రేపుతోంది. కర్పూరి గ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బూఢీ గండక్ డ్యామ్ బైపాస్ రోడ్డుపై ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
పగటిపూట కొందరు యువకులు బైక్‌లపై అక్కడికి చేరుకుని ఓ యువతి, యువకుడిని చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఓ యువతి చేయి పట్టుకుని కొందరు యువకులు బలవంతంగా లాక్కెళ్లేందుకు ప్రయత్నించిన దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. యువతి తీవ్రంగా ప్రతిఘటిస్తున్నప్పటికీ ఆమెను వేధించినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో పోలీసులు స్పందించారు. వీడియో ఆధారంగా నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వారిని విచారిస్తూ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
పగటిపూటే రోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. యువతిని వేధించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read: తిరుపతిలో ఆర్టీసీ విజిలెన్స్ అధికారి ఆత్మహత్య.. డీపీటీఓ కార్యాలయంలో బలవన్మరణం
