Homeజాతీయంవిద్యుత్ ఎమర్జెన్సీ..! పారిశ్రామిక రంగంపై పెను ప్రభావం...

విద్యుత్ ఎమర్జెన్సీ..! పారిశ్రామిక రంగంపై పెను ప్రభావం…

  • ప్రమాదపుటంచున దక్షిణ భారతదేశం

  • తీవ్ర విద్యుత్ సంక్షోభం

  • దాదాపు అన్ని రాష్ట్రాలది అదే పరిస్థితి

  • తమిళనాడులో మరింత తీవ్రం

 

 

 

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్ : ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు వెంటాడాయి తెలుగు రాష్ట్రాలకు. కనీస స్థాయిలో కూడా వర్షాలు పడలేదు. ఒక్క తెలుగు రాష్ట్రాలకే కాదు.. మొత్తం దక్షిణ భారతదేశం పై ఈ ప్రభావం పడింది. లోటు వర్షపాతం నమోదయింది. నైరుతి రుతుపవనాల ప్రభావం కూడా లేకుండా పోయింది. మరోవైపు ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్ వినియోగం పెరిగింది. దీంతో దక్షిణ భారతదేశంలో తీవ్రమైన విద్యుత్ సంక్షోభం తలెత్తుతోంది. పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న ఎల్ నినో ప్రభావంతో సాధారణం కంటే ముందే ఎండలు తీవ్ర రూపం దాల్చడం.. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరడం దక్షిణ భారత గ్రిడ్ ను పెను ఒత్తిడిలోకి నెట్టేసింది. దాని మూలంగానే తీవ్ర విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. సాధారణంగా మార్చి, ఏప్రిల్ తర్వాత విద్యుత్ డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు వర్షాలు లేకపోవడంతో వేసవికి మించి అన్నట్టు గరిష్ట స్థాయిలకు చేరుకుంది.

వేసవికి మించి…

దక్షిణ భారతదేశంలో వేసవిని తలపించినట్టు వర్షాకాలంలో పరిస్థితి ఉంది. వ్యవసాయ పంపుసెట్లకు రికార్డు స్థాయిలో విద్యుత్ వాడకం పెరిగింది. గృహ, వాణిజ్య రంగాల్లో ఎయిర్ కండిషనర్ల వినియోగం విపరీతంగా పెరిగిపోవడంతో.. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతో పాటు కేరళలోనూ విద్యుత్ సమతుల్యత దెబ్బతిని.. గ్రేట్ నిర్వహణ అధికార యంత్రాంగానికి సవాల్ గా మారింది. పారిశ్రామిక హక్కుగా ఉన్న తమిళనాడులో పరిస్థితి చేయి దాటుతోంది. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మీకు డిమాండ్ ఏకంగా 19,000 నుంచి 20వేల మెగావాట్లకు పైగా చేరుకుంది. ఉత్పత్తి, వినియోగం మధ్య తీవ్ర అంతరాయం ఏర్పడింది. సెంట్రల్ గ్రిడ్ నుంచి కేటాయింపులు తగ్గడం, ధర్మల్ ప్లాంట్లలో సాంకేతిక అంతరాయాలు తోడు కావడంతో పారిశ్రామిక ప్రాంతాలు, గ్రామీణ జిల్లాల్లో అనధికారికంగా విద్యుత్ కోతలు అమలు అవుతున్నాయి. రోజుకు నాలుగు నుంచి ఆరు గంటల పాటు సరఫరా నిలిచిపోతుండడంతో పారిశ్రామిక రంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. బహిరంగ మార్కెట్లో యూనిట్ విద్యుత్ ధర గరిష్ట పరిమితి అయిన పది రూపాయలకు చేరుకున్నప్పటికీ.. విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర డిస్కం లకు ఆర్థిక భారం మోయలేని స్థాయికి చేరుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో గడ్డు పరిస్థితులు…

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో సైతం గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణతో పాటు ఏపీలో కూడా పరిస్థితి క్లిష్టంగా మారుతుంది. తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, వేగంగా విస్తరిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గృహ వినియోగం కలగలిపి విద్యుత్ వినియోగం రికార్డ్ స్థాయికి చేరుకుంది. 15,500 మెగావాట్లకు దాటి దూసుకెళ్తోంది. దీంతో క్షేత్రస్థాయిలో వ్యవసాయ ఫీడర్లకు రాత్రి వేళల్లో సరఫరా కుదింపులు, గ్రామీణ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో సరఫరాను నిలిపివేయాల్సి వస్తోంది. ఏపీలో కూడా పరిస్థితి నానాటికి తీసుకట్టుగా మారుతుంది. ఏకంగా విద్యుత్ వినియోగం దాదాపు 240 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. దీంతో విద్యుత్ను అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. బొగ్గు నిల్వల కొరత, ధర్మల్ ఉత్పత్తి పై ఒత్తిడి వల్ల ఏపీలోని గ్రామీణ, పట్టణ శివారు ప్రాంతాల్లో లో లోడ్ షెడ్డింగ్ సంకేతాలు కనిపిస్తున్నాయి.

డెడ్ స్టోరేజ్ కి జలాశయాలు…

కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని సంక్షోభం పూర్తిగా పతాక స్థాయికి చేరుకుంది. హైడ్రో పవర్ వైఫల్యంతో పరిస్థితి మరింత క్షీణిస్తోంది. కర్ణాటక రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో కీలక పాత్ర పోషించే లింగనమక్కి, సుపా జలాశయాల్లో నీటిమట్టం డెడ్ స్టోరేజ్ కు చేరుకుంది. జల విద్యుత్ ఉత్పత్తి దాదాపు 40 శాతం మేర పడిపోయింది. దీంతో బెంగళూరు ఐటి కారిడార్ తో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే తీవ్రమైన విద్యుత్ కోతలు మొదలయ్యాయి. మరోవైపు కేరళలో పరిస్థితి దిగజారుతోంది. ఆ రాష్ట్ర విద్యుత్ అవసరాలలో 70 శాతానికి పైగా జలవిద్యుత్ పైనే ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర ప్రధాన జలాశయమైన ఇడుక్కితో పాటు ఇతర డ్యామ్లలో నీటి నిల్వలు 30 శాతానికి కంటే తక్కువ పడిపోయాయి. రోజువారి డిమాండ్ 100 మిలియన్ యూనిట్లను దాటుతుండగా.. స్థానిక ఉత్పత్తి పడిపోవడంతో కేరళ విద్యుత్ బోర్డ్ రోజుకు దాదాపు 20 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి బయట నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోంది.

ఇలా అయితే కష్టం…

విద్యుత్ పరంగా దక్షిణ భారతదేశ ప్రమాదం అంచున పొంచి ఉంది. ఒక విద్యుత్ ఎమర్జెన్సీ అంచున నిలబడి ఉంది. దక్షిణ భారత ప్రాంతీయ గ్రీడ్ మొత్తం ఏకంగా 65 వేల మెగావాట్లను అధిగమించి కొత్త గరిష్టలను నమోదు చేస్తోంది. కేంద్రం నుంచి అత్యవసర బొగ్గు కేటాయింపులు పెంచడం.. అంతర్ ప్రాంతీయ ట్రాన్స్మిషన్ కారిడార్ల ద్వారా ఉత్తర భారత నుంచి మిగులు విద్యుత్తును తరలించడం, డిస్కం లు కఠినమైన డిమాండ్, మేనేజ్మెంట్ విధానాలు అమలు చేయకపోతే పారిశ్రామిక రంగానికి ఇబ్బందులు తప్పవు. భారీ బ్లాక్ అవుట్ల ముప్పును ఎదుర్కోక తప్పదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు