కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ వైఖరిపై తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కే. స్టాలిన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆయనకు ఆ పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదని స్పష్టం చేశారు.’SIR’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ పేరుతో దేశంలో కోట్లాది మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడాన్ని డీఎంకేతో పాటు పలు ప్రతిపక్ష పార్టీలు మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని స్టాలిన్ గుర్తుచేశారు. ఇటీవల ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రికలో వెలువడిన కథనం ఆధారంగా రాబోయే ఎన్నికల నిర్వహణ మరియు పారదర్శకతపై తీవ్ర సందేహాలు, అనుమానాలు తలెత్తుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్నికల సంఘంలోని మిగతా ఇద్దరు కమిషనర్లు తెలిపిన తీవ్ర అభ్యంతరాలను, వ్యతిరేకతను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా తీవ్ర నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ ప్రజాస్వామ్య సూత్రాలను ఉల్లంఘిస్తున్నందున ఆయన పదవిలో కొనసాగే హక్కును కోల్పోయారని పేర్కొన్నారు. వెంటనే వివాదాస్పద ‘SIR’ ప్రక్రియను నిలిపివేసి, దీనిపై అత్యున్నత స్థాయి సమగ్ర విచారణ జరిపించాలని సీఎం స్టాలిన్ డిమాండ్ చేశారు.
నాని ‘ప్యారడైజ్’ మూవీ రివ్యూ: నటన మెప్పించినా.. కథనంలో తడబాటు!
