ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా భావించే రాఖీ కట్టిన వ్యక్తితోనే ఓ మహిళ ఇల్లు వదిలి వెళ్లినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా చర్చకు దారితీసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఈసానగర్కు చెందిన ఓ మహిళ తన భర్తకు సన్నిహితుడైన వ్యక్తిని సొంత అన్నగా భావించినట్లు తెలుస్తోంది. అతడికి వరుసగా మూడేళ్ల పాటు రాఖీ కట్టినట్లు సమాచారం. అయితే నాలుగో ఏడాది మాత్రం ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రాఖీ కట్టిన అదే వ్యక్తితో కలిసి ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
తన భర్తకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తిని ఇన్నాళ్లూ అన్నగా భావించి రాఖీ కట్టిన మహిళ.. చివరకు అతడితోనే వెళ్లిపోవడంతో ఈ విషయం తెలిసిన వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
రాఖీ పండుగతో ముడిపడిన అన్నాచెల్లెళ్ల బంధానికి ఉన్న ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఇప్పటివరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సమాచారం. మహిళ కుటుంబ సభ్యుల నుంచి కూడా ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి స్పందన వెలువడలేదు.
పోలీసులకు ఫిర్యాదు అందిన తర్వాతే ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
also read: బిహార్లో బాలికపై లైంగిక వేధింపులు కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై పోలీసుల కాల్పులు
