Homeతెలంగాణనిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్‌ నివాసాలపై ఏసీబీ దాడులు.. 13 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు

నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్‌ నివాసాలపై ఏసీబీ దాడులు.. 13 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు

హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్ నోరి లక్ష్మీభాస్కర్‌కు సంబంధించిన నివాసాలు, కార్యాలయాలపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.

ఏసీబీ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఒకేసారి దాదాపు 13 ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఎర్రగడ్డలోని కల్పతరువు అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న డాక్టర్ లక్ష్మీభాస్కర్ నివాసంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులకు సంబంధించిన ప్రాంతాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి.

డాక్టర్ లక్ష్మీభాస్కర్ నిమ్స్‌లో సుమారు 20 ఏళ్లుగా వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఐదేళ్లుగా డిప్యూటీ సూపరింటెండెంట్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని సమాచారం. ఆసుపత్రికి సంబంధించిన వైద్య పరికరాల కొనుగోళ్లు, పరిపాలనా వ్యవహారాల్లో గతంలో ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం కొనసాగుతున్న సోదాల్లో ఆస్తులకు సంబంధించిన పత్రాలు, నగదు, బంగారు ఆభరణాలు, భవనాలు, స్థలాలు, వ్యాపార పెట్టుబడులకు సంబంధించిన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. సోదాలు పూర్తయిన తర్వాత స్వాధీనం చేసుకున్న ఆస్తులు, పత్రాలు, నగదు తదితర వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

also read: టెక్సాస్‌లో భారీ హనుమాన్ విగ్రహంపై వివాదం.. ‘కూల్చేస్తాం’ అంటూ యూట్యూబర్ వ్యాఖ్యలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు