ప్రముఖ నటుడు రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో దర్శకుడు రమేశ్ వర్మ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘మహావీర్ కర్ణ’. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఇందులో మహాభారతంలోని కర్ణుడి పాత్రలో లారెన్స్ కనిపించనున్నారు. పోస్టర్లో ఆయన లుక్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచేలా ఉంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ మూవీస్ సోషల్ మీడియా వేదికగా ఈ ఫస్ట్ లుక్‌ను అభిమానులతో పంచుకుంది. పెన్ మూవీస్ అధినేత జయంతిలాల్ గడ, ఆర్వి స్టూడియోస్, శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. సుమారు రూ.150 కోట్ల బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చిత్ర వర్గాల సమాచారం.
‘మహావీర్ కర్ణ’ను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ముఖ్యంగా రాఘవ లారెన్స్ తొలిసారి పౌరాణిక పాత్రలో నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
కర్ణుడి కాలం నాటి ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించేందుకు చిత్ర బృందం భారీ స్థాయిలో సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అప్పటి రాజ్యాలు, యుద్ధ వాతావరణం, పురాతన నిర్మాణ శైలిని ప్రతిబింబించేలా ప్రత్యేక సెట్లు, డిజైన్లను రూపొందిస్తున్నారని సమాచారం. సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను కూడా భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌ను ఉపయోగించి కర్ణుడి కథను ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. గంభీరమైన రాజ్యాలు, యుద్ధభూములు, భారీ పోరాట సన్నివేశాలతో సినిమాను విజువల్‌గా గ్రాండ్‌గా చూపించేందుకు దర్శకుడు రమేశ్ వర్మ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
మహాభారతంలో గౌరవం, విధి, నమ్మకం, త్యాగం వంటి అంశాలతో ముడిపడిన కర్ణుడి పాత్రలో రాఘవ లారెన్స్ ఎలా కనిపించబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో నటించే మిగతా నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు మేకర్స్ తెలిపారు.
భారీ బడ్జెట్, పాన్ ఇండియా విడుదల, గ్రాండ్ విజువల్స్‌తో రూపొందుతున్న ‘మహావీర్ కర్ణ’ను వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
also read: వైసీపీకి మరో సీనియర్ గుడ్ బై…!
