Homeఆంధ్ర ప్రదేశ్వైసీపీకి మరో సీనియర్ గుడ్ బై...!

వైసీపీకి మరో సీనియర్ గుడ్ బై…!

  • పార్టీకి రాజీనామా చేసిన ప్రతిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు

  • త్వరలో జనసేనలో చేరిక

 

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి మరో సీనియర్ గుడ్ బై చెప్పారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పార్టీకి రాజీనామా చేశారు. ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు సైతం రాజీనామా ప్రకటించారు. గత సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీలో కొనసాగుతున్న స్తబ్దత, కేడర్ కు భరోసా లేకపోవడం, నియోజకవర్గంలో పార్టీ అంతర్గత వ్యవహారాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీకి రాజీనామా చేశారు. మొన్ననే ఉత్తరాంధ్ర కు చెందిన సీనియర్ నేత చిన్న శ్రీను పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు మరో కాపు నేత ఆ పార్టీని వీడడం షాకింగ్ కు గురి చేసే అంశం. త్వరలో ఆయన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరుతారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు.

సుదీర్ఘ రాజకీయ నేపథ్యం…

Also Read: హద్దులు మీరితే చూస్తూ ఊరుకోం: వైసీపీ నిరసనలపై సీఎం చంద్రబాబు తీవ్ర హెచ్చరిక!

సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది వరుపుల సుబ్బారావుకు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన ప్రత్తిపాడు నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా గెలుపొందారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల అనంతరం వైసిపి అధిష్టానం వైఖరి, స్థానిక నాయకత్వాన్ని పట్టించుకోకపోవడం, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో పార్టీ నాయకత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు.

త్వరలో పవన్ సమక్షంలో…

Also Read:రష్యా ఎన్నికల్లో పుతిన్ పార్టీ ఘనవిజయం.. పార్లమెంట్‌లో మళ్లీ తిరుగులేని ఆధిపత్యం

జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకున్న తరువాత ఆయన వైసీపీకి రాజీనామా చేసినట్లు అర్థమవుతోంది. పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేనలో చేరనున్నారు. ఆయనతోపాటు ముఖ్య నాయకులు, ద్వితీయ శ్రేణి క్యాడర్ సైతం జనసేన లోకి వెళ్ళనుంది. వరుపుల సుబ్బారావు రాజీనామాతో ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైసిపి దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఏలేశ్వరం, ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి మండలాల్లో ఆయనకు వ్యక్తిగతంగా ఉన్న పట్టు, బలమైన క్యాడర్ జనసేన వైపు మళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే పిఠాపురంలో టిడిపి ఎమ్మెల్యేగా వరుపుల సత్యప్రభ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు సుబ్బారావు సైతం జనసేనలో చేరనుండడంతో ఇక్కడ కూటమి బలమైన శక్తిగా అవతరించే అవకాశం కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు