-
మీడియా ముందుకు ఆయన అన్న కుమార్తె రమ్యారావు
-
తమ తాతకు 10 ఎకరాల భూమి కూడా లేదని వెల్లడి
-
కెసిఆర్ కుటుంబానికి వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి అంటూ ప్రశ్న
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయం కేసిఆర్ ఆస్తుల చుట్టూ తిరుగుతోంది. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కెసిఆర్ కుటుంబ ఆస్తుల వివరాలను వెల్లడించారు. దీంతో గులాబీ పార్టీ ఆత్మరక్షణలో పడింది. అయితే ఇప్పటివరకు కేసీఆర్ కు అసలు ఆస్తులు లేవని.. సొంత ఇల్లు కూడా లేదని చెప్పుకొచ్చిన కేటీఆర్, హరీష్ రావులు మాట మార్చారు. తమది సంపన్న కుటుంబం అని.. తమ పూర్వీకులకు వందల ఎకరాల భూములు ఉన్నట్లు కేటీఆర్ ప్రకటించారు. అదే కేటీఆర్ గతంలో తమకు ఆస్తులు లేవంటూ సెలవిచ్చారు. దీంతో సోషల్ మీడియాకు ఆయన టార్గెట్ అయ్యారు. ఈ నేపథ్యంలో కెసిఆర్ అన్న కుమార్తె రమ్యారావు మీడియా ముందుకు వచ్చారు. సంచలన అంశాలను వెల్లడించారు.
తమ పూర్వీకుల ఆస్తుల వెల్లడి…
Also Read:సర్కారీ వైద్యం, విద్యపై ప్రజాప్రతినిధుల అలసత్వం: ‘కాక్రోచ్ జనతా పార్టీ’ తీవ్ర ఆరోపణలు
కెసిఆర్ తండ్రి రాఘవరావుకు పది ఎకరాల భూమి కూడా ఉండేది కాదు అని బాంబు పేల్చారు రమ్యారావు. ఆమె కెసిఆర్ అన్న రంగారావు కుమార్తె. ఆమెతో పాటు కేటీఆర్ కు దాదాపు ఒకే సమయంలో వివాహాలు జరిగాయట. కానీ ఆ సమయంలో పది ఎకరాలు కూడా వారి వద్ద భూమి లేదట. కేటీఆర్ గుంటూరులో చదివితే.. ఆమె కరీంనగర్లో చదివే వారట. పది ఎకరాలు కూడా అప్పట్లో ఉండేవి కాదని.. కానీ ఇప్పుడు వందల కోట్ల సంపద కేసీఆర్ ఫ్యామిలీకి ఎక్కడి నుంచి వచ్చిందో సమాధానం చెప్పాలని రమ్యారావు డిమాండ్ చేశారు. మొత్తం కుటుంబ సభ్యుల అక్రమాస్తుల చిట్టాను ఆమె బయట పెట్టేసారు.
సంతోష్ రావు అవినీతి…
Also Read:హద్దులు మీరితే చూస్తూ ఊరుకోం: వైసీపీ నిరసనలపై సీఎం చంద్రబాబు తీవ్ర హెచ్చరిక!
మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రమ్యా రావు. కరీంనగర్ లో ఉన్నప్పుడు కనీస ఆదాయం కూడా లేని సంతోష్ రావుకు అధికారంలోకి వచ్చాక వేలకోట్ల ఆస్తులు ఎలా సమకూరాయి అని నిలదీశారు. బీసీల పేరుతో ఓ ప్రాజెక్టు నిర్వాసితులమని చెప్పి పరిహారాన్ని దోచుకున్నారని ఆరోపించారు. 2018 రాజ్యసభ ఎన్నికల అఫిడవిట్ లో కూడా ఆస్తులు సక్రమంగా చూపలేదని మండిపడ్డారు. భారీగా భూములు కబ్జా చేసారని ఆరోపించారు. సంతోష్ రావు పాల్పడిన భూ దందాలు, అక్రమాలు తెలిసి కూడా కేటీఆర్ ఆయనకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
Also Read:రష్యా ఎన్నికల్లో పుతిన్ పార్టీ ఘనవిజయం.. పార్లమెంట్‌లో మళ్లీ తిరుగులేని ఆధిపత్యం
మార్కుక్ లో 9 ఎకరాల భూమి, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14, కొండాపూర్ వంటి అత్యంత ఖరీదైన ప్రేమ్ ఏరియాల్లో విలాసవంతమైన నివాసాలు, ఆస్తులు ఎలా సమకూరాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సంతోష్ రావు భార్య రోహిణి పేరుతో నానాక్ రామ్ గూడా లో వెలసిన భారీ కమర్షియల్ భవనాలు, సోదరి సౌమ్య పేరుతో ఉన్న బినామీ భూములపై సమగ్ర విచారణ జరపాలని చేశారు. తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్న సంతోష్ రావును కేసీఆర్ కుటుంబం ఎందుకు అందలం ఎక్కించిందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మొత్తానికైతే కెసిఆర్ కుటుంబ ఆస్తులపై రేవంత్ ప్రారంభించిన చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలని షేక్ చేస్తోంది.
