Homeఆంధ్ర ప్రదేశ్DSC స్కామ్‌పై CBI విచారణకు జగన్ డిమాండ్!

DSC స్కామ్‌పై CBI విచారణకు జగన్ డిమాండ్!

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న డిఎస్సి నియామకాల ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, దీనిపై తక్షణమే కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) చేత విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై పారదర్శకమైన విచారణకు ఆదేశించమంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎందుకు వెనుకంజ వేస్తున్నారని, ప్రభుత్వం ఎందుకు భయపడుతోందో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు.విజయవాడ వేదికగా వైఎస్సార్‌సీపీ నేతలు, విద్యార్థులు మరియు నిరుద్యోగ యువత కలిసి చేపట్టిన శాంతియుత ర్యాలీపై పోలీసులు ప్రదర్శించిన వైఖరిని జగన్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలిపే హక్కు ప్రతిపక్షాలకు లేదా అని ఆయన నిలదీశారు. న్యాయమైన విచారణను కోరుతూ నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం దారుణమన్నారు. అంతేకాకుండా, ఉపాధ్యాయుల ముసుగులో అధికార పార్టీకి చెందిన రౌడీలతో దాడులకు తెగబడ్డారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

హద్దులు మీరితే చూస్తూ ఊరుకోం: వైసీపీ నిరసనలపై సీఎం చంద్రబాబు తీవ్ర హెచ్చరిక!

రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ స్కామ్‌కు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంతటి అణచివేత చర్యలకు పాల్పడినా నిరుద్యోగుల తరఫున వైఎస్సార్‌సీపీ పోరాటం ఆపేది లేదని, విద్యార్థులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేంత వరకు తమ గళం వినిపిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.

రష్యా ఎన్నికల్లో పుతిన్ పార్టీ ఘనవిజయం.. పార్లమెంట్‌లో మళ్లీ తిరుగులేని ఆధిపత్యం

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు