Homeతెలంగాణకేటీఆర్ ఫామ్ హౌస్ పై దండయాత్ర...!

కేటీఆర్ ఫామ్ హౌస్ పై దండయాత్ర…!

  • అకస్మాత్తుగా తెరపైకి ప్రదీప్ రెడ్డి

  • అదంతా తనదేనంటూ బోర్డులు

  • కొట్టిపారేస్తున్న కాంగ్రెస్ నేతలు

 

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయమంతా ఇప్పుడు భూముల చుట్టూ, ఫామ్ హౌస్ ల చుట్టూ తిరుగుతోంది. శాసనసభలో కెసిఆర్ ఆస్తుల వివరాలను ప్రకటించారు సీఎం రేవంత్. అంతటితో ఆగకుండా ఫామ్ హౌస్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. అందులో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భూములను గుర్తించేందుకు రెవెన్యూ యంత్రాంగాన్ని రంగంలోకి దించారు. మరోవైపు కేటీఆర్ ఫామ్ హౌస్ పై కూడా కాంగ్రెస్ పార్టీ దండయాత్ర ప్రారంభించింది. కేటీఆర్ అక్రమాస్తుల్లో జన్వాడ ఫామ్ హౌస్ ఉంది అంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా జీవో 111 పరిధిలో నిర్మించినట్లు ఆరోపణలు ఎదురవుతున్న క్రమంలో ఆసక్తికర అంశం బయటపడింది. ఈ లగ్జరీ ఫామ్ హౌస్ తమదేనంటూ బిల్డర్ ప్రదీప్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి వివరణలు ఇస్తున్నారు. అది తన సొంత ఆస్తి అని.. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కేవలం లీజుకు మాత్రమే ఇచ్చినట్లు చెబుతున్నారు. మరోవైపు ఫామ్ హౌస్ ప్రాంగణంలో ప్రధాన ద్వారం వద్ద ప్రదీప్ రెడ్డి పేరుతో ప్రత్యేక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.

భారీ కాన్వాయ్ తో…

Also Read: బాక్సాఫీస్ వద్ద ‘మండాడి’ సంచలనం.. రూ.100 కోట్ల క్లబ్‌లో చిన్న సినిమా!

కేటీఆర్ ఫామ్ హౌస్ పై కాంగ్రెస్ పార్టీ దండయాత్ర చేసింది. ప్రదీప్ రెడ్డి చేస్తున్న ప్రకటనలను అస్సలు పట్టించుకోలేదు. శనివారం పీసీసీ నేతలు, కార్యకర్తలు భారీ కాన్వాయ్ తో జన్వాడ యాత్ర చేపట్టారు. ఫామ్ హౌస్ వద్దకు చేరుకోగా పోలీసులు భారీ భారీ గేట్లు ఏర్పాటు చేసి బయట అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫామ్ హౌస్ ను బయట నుంచే పరిశీలించిన కాంగ్రెస్ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. ప్రదీప్ రెడ్డి స్వతంత్ర బిల్డర్ కాదని.. ఆయన ముమ్మాటికి కేటీఆర్ కు ప్రధాన బినామీ అని ఆరోపించారు. జన్వాడ ప్రాంతంలో నిబంధనలను తుంగలో తొక్కి నిర్మించిన ఈ ప్యాలెస్ వెనుక అసలు పెట్టుబడి ఎవరిదో ప్రజలందరికీ తెలుసని మండిపడ్డారు.

గులాబీ పార్టీలో ఆందోళన…

Also Read:ఏఐ ప్రాణం తీసింది: చాట్‌జీపీటీ తప్పుడు సలహాతో యువకుడి మృతి.. ఓపెన్ఏఐ సంస్థపై తల్లి దావా!

అయితే ఒక్కసారిగా ఫామ్ హౌస్ లపై కాంగ్రెస్ పార్టీ పడటంతో గులాబీ పార్టీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. గత కొంతకాలంగా జన్వాడ ఫామ్ హౌస్ అంటే కేటీఆర్ దేనని ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఇప్పుడు చట్టపరమైన చిక్కులు, కూల్చివేతల భయంతో తప్పించుకునేందుకే ప్రదీప్ రెడ్డి ని ముందుంచి బుకాయిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రదీప్ రెడ్డి కేవలం తెరపై కనిపించే పాత్రధారి మాత్రమేనని.. నిర్మాణ అనుమతులు, ఆర్థిక లావాదేవీలు, లీజు అగ్రిమెంట్ల వెనుక ఉన్న నగదు ప్రవాహాన్ని ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. చూడాలి ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు