Homeక్రైమ్అమృత్‌సర్‌లో ASIపై దుండగుల దాడి.. కాల్పుల్లో మృతి చెందిన పోలీస్ అధికారి హర్జీత్ సింగ్

అమృత్‌సర్‌లో ASIపై దుండగుల దాడి.. కాల్పుల్లో మృతి చెందిన పోలీస్ అధికారి హర్జీత్ సింగ్

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో విధుల్లో ఉన్న పోలీస్ అధికారిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. భగ్తావాలా ప్రాంతంలోని ధాన్యం మార్కెట్‌లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ASI) హర్జీత్ సింగ్ విధులు నిర్వహిస్తున్న సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.

కాల్పుల్లో హర్జీత్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే హర్జీత్ సింగ్‌పై దాడికి కారణమేంటి? నిందితులు ఎవరు? అనే వివరాలు ప్రస్తుతానికి తెలియరాలేదు. దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

also read: మొదటి భార్యతో భర్తకు సంబంధాలు.. ప్రియుడితో కలిసి రెండో భార్య దారుణం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు