Homeతెలంగాణమంత్రిగా దానం...?

మంత్రిగా దానం…?

  • ఒక్క రిస్కుతో క్యాబినెట్ లోకి

  • న్యాయ పోరాటం కంటే రాజీనామా చేస్తేనే మేలు

  • ఖైరతాబాద్ ఉప ఎన్నికలో నెగ్గుకొస్తే అమాత్య పదవి

 

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: ఖైరతాబాద్ ఉప ఎన్నిక దానం నాగేందర్ కు వరమా? ఆయనకు మంత్రి పదవి అవలీలగా దక్కే అవకాశమా? అంటే అవుననే సమాధానం చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. పదవిని వదులుకొని ఉప ఎన్నికకు వెళ్తే దానం నాగేందర్ కి ఎక్కువ అవకాశం అని.. ఆయన మంత్రి కూడా అవుతారన్న టాక్ నడుస్తోంది. ఎందుకంటే ఆయన చేసిన త్యాగాలకు కాంగ్రెస్ హై కమాండ్ కచ్చితంగా మంత్రి పదవి ఇస్తుంది కూడా. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. అంతే దూకుడుగా సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేశారు కాంగ్రెస్ అభ్యర్థిగా. కేవలం మంత్రి పదవి దక్కుతుందన్న ఆశతోనే ఆయన పెద్ద సాహసం చేశారు. మంత్రి పదవి హామీ తోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ అనుకున్న స్థాయిలో కాంగ్రెస్ దానం నాగేందర్ కు అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు బైపోల్లో మాత్రం గెలిస్తే దానం నాగేందర్ కు మంత్రి పదవి ఇవ్వడం ఖాయం.

మంత్రి హామీ తోనే…

Also Read:ప్రేమ, ఈర్ష్యతోనే యువతి మర్డర్.. లెక్చరర్‌తో పాటు మరో వ్యక్తి అరెస్ట్!

గులాబీ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ గూటికి చేరారు దానం నాగేందర్. కానీ ఆయనపై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. వాస్తవానికి మంత్రి పదవి ఒప్పందంతోనే ఆయన కాంగ్రెస్లోకి వెళ్లారు. అంతటితో ఆగకుండా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో గెలిస్తే కేంద్ర రాజకీయాలు.. గెలవకపోతే రాష్ట్రంలోనే మంత్రి పదవి కట్టబెడతారన్న ఒప్పందంతోనే ఆయన హస్తం గూటికి అప్పట్లో చేరారు. అయితే ఎమ్మెల్యేగా కొనసాగుతూనే ఇతర పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడంతో తలెత్తిన చట్టపరమైన చిక్కులు, టెన్త్ షెడ్యూల్ నిబంధనల భయంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేకపోయింది. కానీ ఇప్పుడు హైకోర్టు స్వయంగా అనర్హత వేటు వేసి.. నియోజకవర్గాన్ని ఖాళీగా ప్రకటించడంతో.. పరోక్షంగా దానం నాగేందర్ కు మంత్రి పదవి వైపు అడ్డంకులన్నీ తొలగిపోయినట్లే అని కనిపిస్తోంది.

సుప్రీంకోర్టులో కష్టమే…

Also Read:అమెరికాకు ఇరాన్ హెచ్చరిక: హామీలు నెరవేర్చే వరకు హోర్ముజ్ జలసంధి మూసివేత..

ప్రస్తుత పరిస్థితుల్లో దానం నాగేందర్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడానికి వెంపర్లాడడం కంటే.. నేరుగా ప్రజాక్షేత్రంలోని తేల్చుకోవడం మేలు. ఇప్పటికే హైకోర్టు డివిజన్ బెంచ్ పక్కా ఆధారాలతో ఇచ్చిన తీర్పు తో సర్వోన్నత న్యాయస్థానంలో స్టే దక్కడం అంత సులువు కాదు. కానీ ఎందుకో దానం నాగేందర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇది సమయాన్ని వృధా చేయడమే అవుతుంది. అదే రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్తే కచ్చితంగా ఖైరతాబాద్ లో దానం నాగేందర్ వైపు మొగ్గు ఉంటుంది. ఆయన వ్యక్తిగత ఇమేజ్కు తోడు అధికార యంత్రాంగం గట్టిగా పని చేస్తే గెలవడం చాలా ఈజీ. ఎలాగూ కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇవ్వాల్సిందే. గ్రేటర్ హైదరాబాద్ కోటాలో.. అది బీసీల కోటాలో కాంగ్రెస్ హై కమాండ్ ఇవ్వక తప్పదు. ఒక్క రిస్క్ తో ఇట్టే మంత్రి పదవి పొందగలరు దానం నాగేందర్. చూడాలి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు