Homeసినిమానాని - శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబో 'ప్యారెడైజ్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్...

నాని – శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబో ‘ప్యారెడైజ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్!

క్రైమ్ మిర్రర్, సినిమా:- నేచురల్ స్టార్ నాని మరియు టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ప్యారెడైజ్’. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈనెల 21వ తేదీన హైదరాబాద్‌లోని ప్రసిద్ధ వేదిక అయిన శిల్పకళా వేదికలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు.’జడల్ జమానా తన అడ్డాకు చేరుకుంది’ అనే పవర్‌ఫుల్ క్యాప్షన్‌తో విడుదల చేసిన తాజా పోస్టర్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఈ చిత్రంలో నాని లుక్ మరియు ఆయన మేకోవర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ భారీ బడ్జెట్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 24వ తేదీన గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

కాంగ్రెస్ శ్రేణుల‌కు గుడ్‌న్యూస్‌…! నామినేటెడ్ ప‌దవుల భ‌ర్తీకి హైక‌మాండ్ ఆదేశం…

సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే ఇప్పటికే విడుదలైన ‘ఆయా షేర్’, ‘యేష నాగుల’ వంటి పవర్ ఫుల్ సాంగ్స్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తూ భారీ వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. ఈ పాటలు సినిమాపై హైప్‌ను మరింత పెంచేశాయి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ అతిథులు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. నాని గత సినిమాల రికార్డులను ఈ చిత్రం బ్రేక్ చేస్తుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శిల్పకళా వేదికలో జరగనున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన ఏర్పాట్లను చిత్ర బృందం ఇప్పటికే పూర్తి చేసింది.

ప్రపంచాన్ని కలవరపెడుతున్న వైద్యుల కొరత: WHO హెచ్చరికల వెనుక అసలు నిజాలు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు