Homeతెలంగాణకాంగ్రెస్ శ్రేణుల‌కు గుడ్‌న్యూస్‌...! నామినేటెడ్ ప‌దవుల భ‌ర్తీకి హైక‌మాండ్ ఆదేశం...

కాంగ్రెస్ శ్రేణుల‌కు గుడ్‌న్యూస్‌…! నామినేటెడ్ ప‌దవుల భ‌ర్తీకి హైక‌మాండ్ ఆదేశం…

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు గుడ్ న్యూస్. పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవుల భర్తీకి హై కమాండ్ కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 50 కార్పొరేషన్లకు కొత్త బాసులు రానున్నారు. పార్టీకి సేవలందించిన వారికి పెద్ద పీట వేయనున్నారు. అదే సమయంలో సామాజిక సమీకరణలను పరిగణలో తీసుకోనున్నారు. కొంతమంది పాత వారికి సైతం రెన్యువల్ చేయనున్నారు. దీంతో ఆశావహుల్లో ఒక్కసారిగా సందడి ప్రారంభం అయింది. గత కొద్ది రోజులుగా నేతలు, కార్యకర్తలు పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఇప్పటికే నియమితులైన వారి పదవీకాలం ముగిసింది. అటువంటి వారు రెన్యువల్స్ కోరుకుంటున్నారు. అయితే ఈ నెల చివర్లో పదవులను పూర్తిస్థాయిలో భర్తీ చేసేందుకు అధిష్టానం కసరత్తు మొదలు పెట్టింది.

జిల్లాల వారీగా జాబితాలు…

Also Read: విద్యుత్ కంచెకు బాలుడు, కుక్క బలి.. ప్రకాశం జిల్లాలో విషాదం

కాంగ్రెస్ పార్టీ జిల్లాల వారీగా నామినేటెడ్ పదవులకు సంబంధించి జాబితాలను సిద్ధం చేసింది. సీనియారిటీతోపాటు సిన్సియారిటీని పరిగణలోకి తీసుకుంది. చివరిగా సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఆమోద ముద్ర తో ప్రకటన చేయాలని భావిస్తోంది. సుమారు 50 కార్పొరేషన్లకు సంబంధించి నియామకాలు లేవు. అందుకే వాటి పై ఆశలు పెట్టుకున్న నేతలకు నిరాశ ఎదురవుతోంది. మరోవైపు ఎమ్మెల్యేలపై క్షేత్రస్థాయిలో ఒత్తిడి పెరుగుతోంది. ఇంకోవైపు పార్టీలో అసంతృప్త స్వరం వినిపిస్తోంది.. అందుకే వీలైనంత త్వరగా పదవుల భర్తీకి ముందుకొచ్చింది అధిష్టానం. ఇందుకుగాను కీలక ప్రకటన కూడా రానుంది. వాస్తవానికి 2024 జూలైలో రెండేళ్ల కాల పరిమితికి నియమితులైన పలువురు పదవులు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే కొత్త నియామకాలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది.

సామాజిక సమీకరణలకు పెద్ద పీట…

Also Read:కత్తితో పొడిచి యువకుడి హత్య.. పరారీలో నిందితుడు

ఈసారి నామినేటెడ్ పదవుల్లో కుల గణన ప్రాధాన్యత సంతరించుకొనుంది. వెనుకబడిన తరగతుల వారికి ప్రధానంగా అవకాశాలు కల్పించనున్నారు. అయితే మిత్రపక్షాలకు సంబంధించి కూడా ఒకరిద్దరి పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. కోదండరాం పార్టీకి సంబంధించి ఓ ఇద్దరికి చైర్మన్లుగా అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడం.. సార్వత్రిక ఎన్నికల్లో సైతం సత్తా చాటాలంటే బలమైన నేతలకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టాలని ఎమ్మెల్యేలు ఒత్తిడి పెంచుతున్నారు. అయితే జిల్లాల వారీగా జాబితాలను వడబోసి టిపిసిసి నాయకత్వం సీఎం రేవంత్ రెడ్డి తో పాటు పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లింది. అయితే దీనిపై తుది కసరత్తు చేసి.. ఈ నెల చివరిలో పదవులు ప్రకటించాలని చూస్తోంది కాంగ్రెస్ అధిష్టానం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు