Homeక్రైమ్ఆర్టీసీ క్రాస్ రోడ్స్ స్టీల్ బ్రిడ్జిపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ స్టీల్ బ్రిడ్జిపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య

క్రైమ్ మిర్రర్ : నగరంలోని తీవ్ర రద్దీ ప్రాంతమైన ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ వద్ద శుక్రవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇందిరా పార్క్ – విఎస్టి స్టీల్ బ్రిడ్జి పైనుంచి ఒక యువకుడు సడన్‌గా కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర తీవ్ర దిగ్భ్రాంతిని, కలకలాన్ని రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాంనగర్ ప్రాంతానికి చెందిన మనోజ్ అనే యువకుడు శివం రోడ్‌లోని అపోలో డయాగ్నోస్టిక్ సెంటర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం సమయం లో ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ స్టీల్ బ్రిడ్జిపైకి చేరుకున్న మనోజ్, ఊహించని విధంగా ఒక్కసారిగా కిందకు దూకేశాడు. తీవ్ర గాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

సమాచారం అందుకున్న వెంటనే ముషీరాబాద్, చిక్కడపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మనోజ్ ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు లేదా ఉద్యోగ సంబంధిత ఒత్తిడులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఘటనా స్థలంతో పాటు బ్రిడ్జి పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
also read : ఫిలిప్పీన్స్‌లో మళ్లీ కాల్పుల కలకలం.. బంగా పట్టణ స్కూల్‌లో 16 ఏళ్ల బాలుడి ఘాతుకం

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు