Homeతెలంగాణరాజకీయాల్లోకి హైడ్రా రంగనాథ్...!

రాజకీయాల్లోకి హైడ్రా రంగనాథ్…!

  • జనసేనలో చేరే అవకాశం

  • ఎంపీగా ఏపీ నుంచి పోటీ

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: హైడ్రా రంగనాథ్ రాజకీయాల్లోకి వెళ్తారా? వెళితే ఏ పార్టీలో చేరుతారు? తెలంగాణ రాజకీయాల్లోకి వెళ్తారా? లేకుంటే ఏపీ పాలిటిక్స్ లో ప్రవేశిస్తారా? పొలిటికల్ వర్గాల్లో దీనిపైనే చర్చ నడుస్తోంది. తెలంగాణలో హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ కు గొప్ప గుర్తింపు ఉంది.

ముక్కు సూటిగా పనిచేస్తారు అని మంచి పేరు ఉంది. గతంలో తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పోలీస్ అధికారిగా పనిచేశారు. ప్రధానంగా భూ ఆక్రమణలపై గట్టిగానే ఫోకస్ పెట్టారు. అందుకే కెసిఆర్ సైతం వరంగల్ లాంటి నగరానికి పోలీస్ కమిషనర్ గా రంగనాథ్ ని నియమించారు.

  • సీఎం రేవంత్ మద్దతు..

సీఎం రేవంత్ రెడ్డి మానస పుత్రిక హైడ్రాకు కమిషనర్ గా వ్యవహరిస్తున్నారు రంగనాథ్. హైదరాబాద్ నగరంలో చెరువులను రక్షించారు. కుంటలను బాగు చేశారు. నాలాలను పరిరక్షించారు. ఒక్క మాటలో చెప్పాలంటే విప్లవాత్మక విధానాలకు శ్రీకారం చుట్టారు.

కోర్టుల ద్వారా కొంతమంది వ్యక్తులు ఆయనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. రంగనాథ్ కు సీఎం రేవంత్ రెడ్డి బలమైన మద్దతు ఉంది. అందుకే కోర్టులకు వెళ్లి మరి ఆయనను కొనసాగించగలుగుతున్నారు.

  • మున్నూరు కాపు ఆత్మీయ సమావేశానికి..

హైడ్రా రంగనాథ్ రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దానికి కారణం హైదరాబాద్ నగరంలో మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనానికి రంగనాథ్ హాజరయ్యారు. ఆయన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఏపీకి చెందిన కూటమి కీలక నాయకులు సైతం ఈ సమావేశానికి హాజరయ్యారు.

వారితో వేదిక పంచుకున్నారు. వాస్తవానికి హైడ్రా రంగనాథ్ పై ఒక విమర్శ ఉంది. కుల సంఘాల సమావేశాలకు ఆయన హాజరవుతుంటారు. వీటిపై విమర్శలు వచ్చినా ఆయన పెద్దగా పట్టించుకోరు.

అయితే ఇప్పుడు ఏకంగా రాజకీయ నేతలతో ఆయన వేదిక పంచుకోవడంతో పాలిటిక్స్ లోకి వస్తారని ప్రచారం నడుస్తోంది. ప్రధానంగా ఆయన ఎంపీగా పోటీ చేస్తారన్న టాక్ ఉంది. వచ్చే ఎన్నికల్లో ఏపీ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం కూడా ఉంది.

  • మెగా ఫ్యామిలీతో సంబంధాలు..

మెగాస్టార్ ఫ్యామిలీతో రంగనాథ్కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా ముద్రపడ్డారు. గతంలో ఆయన పవన్ కళ్యాణ్ ను కలిసారు కూడా. రాజకీయాల్లోకి వస్తే జనసేనలో చేరే అవకాశం ఉంది. ఆయనకు రాజకీయ ఆసక్తి సైతం ఉందని సన్నిహితులు చెబుతుంటారు.

అయితే రాజకీయాలకు సంబంధించి ఎటువంటి ప్రకటనలు చేయలేదు. అయితే గతంలో చాలామంది పోలీస్ ఉన్నతాధికారులు.. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని మరి రాజకీయాల్లోకి వచ్చారు. మరి హైడ్రా రంగనాథ్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు