Homeక్రైమ్కత్తితో బెదిరించి రూ.20 వేల డిమాండ్.. రౌడీషీటర్ అరెస్ట్

కత్తితో బెదిరించి రూ.20 వేల డిమాండ్.. రౌడీషీటర్ అరెస్ట్

క్రైమ్ మిర్రర్ : ఇంట్లోకి చొరబడి ఓ యువకుడి గొంతుకు కత్తి పెట్టి రూ.20 వేల నగదు ఇవ్వాలని బెదిరించిన రౌడీషీటర్‌ను అత్తాపూర్ పోలీసులు, రాజేంద్రనగర్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి నాలుగు కత్తులు, ఓ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అత్తాపూర్ సీఐ సీతయ్య తెలిపిన వివరాల ప్రకారం.. అత్తాపూర్‌కు చెందిన సయ్యద్ మహమ్మద్ అలియాస్ చంగో (25)పై గతంలో ఆస్తి వివాదాలు, దాడులు, ఎన్డీపీఎస్‌ చట్టానికి సంబంధించిన కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

సెప్టెంబర్ 4న రాత్రి నూర్ జహాన్ బేగం ఇంట్లోకి చంగో అక్రమంగా ప్రవేశించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం ఆమె కుమారుడు అబ్దుల్ రెహమాన్‌ను కత్తితో బెదిరిస్తూ రూ.20 వేల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశాడని తెలిపారు. డబ్బులు ఇవ్వకపోతే హత్య చేస్తానంటూ హెచ్చరించినట్లు వెల్లడించారు. కుమారుడిని కాపాడేందుకు తల్లి ప్రయత్నించగా ఆమెను కూడా కత్తితో బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై సెప్టెంబర్ 13న పోలీసులకు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి కేవలం 12 గంటల్లోనే చంగోను అదుపులోకి తీసుకున్నాయి. నిందితుడి వద్ద తనిఖీలు నిర్వహించగా నాలుగు కత్తులు, ఒక మొబైల్ ఫోన్ లభించడంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
also read : మైనర్‌పై లైంగిక దాడి కేసు.. 8 మంది నిందితులకు డ్రగ్స్ పరీక్షలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు