Homeక్రైమ్ఫ్రిజ్ పేలి నలుగురు మహిళలు మృతి

ఫ్రిజ్ పేలి నలుగురు మహిళలు మృతి

క్రైమ్ మిర్రర్ : నాయక చవితి పండగ వేళ కర్ణాటకలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఫ్రిజ్‌లో అకస్మాత్తుగా పేలుడు సంభవించడంతో నలుగురు మహిళలు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బెలగావిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రాజారాం అనే వ్యక్తికి చెందిన ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా గత రాత్రి ఒక్కసారిగా ఫ్రిజ్ పేలిపోయింది. దీంతో ఇంట్లో మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రమాదంలో గజానన్ ధామోన్ (65), రోషన్ ధమోన్ (21), శారద ధామోన్ (45), భారతి ధామోన్ (50) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనలో శారద కుమార్తెలైన ప్రియా ధమోన్, గంగా ధమోన్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తులో ఫ్రిజ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి పేలుడు సంభవించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు అనంతరం మంటలు తీవ్రంగా వ్యాపించడంతో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు బయటకు రాలేకపోయారని, ఈ కారణంగానే నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫ్రిజ్ పేలుడుకు అసలు కారణం ఏమిటన్న దానిపై విచారణ కొనసాగుతోంది.
also read : 80s ట్రెండ్‌తో బయటపడిన 45 ఏళ్ల నాటి దొంగతనం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు