అమరావతి, క్రైమ్‌మిర్రర్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గణేశ్ చతుర్థి జరుపుకున్నారు. కుటుంబ సమేతంగా విఘ్నేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి గణనాథుడి పూజలో పాల్గొనడం ఎంతో గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చిందని చంద్రబాబు తెలిపారు. ఈ పూజ ద్వారా ఏపీ అభివృద్ధికి ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగిపోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు.
సీఎం చంద్రబాబు ఎక్స్ పోస్టు…
Also Read: కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
‘ఓం గణేశాయ నమః.. వినాయక చవితి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి మా నివాసంలో విఘ్నేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించాం. కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించిన గణనాథుడి పూజ ఎంతో గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చింది. గణపతి జ్ఞానానికి, వివేకానికి, విజయానికి ప్రతీక. ఏ శుభకార్యాన్నైనా వినాయక పూజతో ప్రారంభించడం మన సంప్రదాయం. విఘ్నాలను తొలగించి, సన్మార్గాన్ని చూపే చవితి వేడుకలు మనకు సామాజిక స్పృహను, ఐక్యతను నేర్పిస్తాయి. సమష్టితత్వాన్ని బోధిస్తాయి.
Also Read: బర్త్‌డే వేడుకల తర్వాత విషాదం.. లాంగ్‌డ్రైవ్‌లో విద్యార్థి మృతి
సమాజాన్ని సన్మార్గంలో నడిపించేవి మన ధార్మిక కార్యక్రమాలు. ఇందులో వాడవాడలా మండపాలతో జరిగే వినాయక చవితి వేడుకలు మరింత ప్రత్యేకం. మన సంస్కృతికి, ఆధ్యాత్మిక చైతన్యానికి నిలువెత్తు ప్రతీకగా చవితి వేడుకలు కనిపిస్తాయి. వినాయకుడి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి. రాష్ట్రాభివృద్ధికి ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగి.. ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా, తెలుగు జాతి వర్థిల్లేలా ఆనందంగా ఉండాలని గణనాథుడిని ప్రార్థించాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు’ అంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు.
