హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అన్యోనంగా, ఆనందంగా గడుస్తున్న కాపురంలో అనుమానం పెనుభూతమై ఆరు నెలల గర్భిణి అయిన భార్యను భర్త గొంతు నులిమి హత్య చేసిన ఘటన అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సూర్యనగర్‌లో చోటు చేసుకుంది. ఈ ఘగటనలో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. కాగా అనుమానంతోనే ఈ దారుణ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
Also Read: ప్రేమలో విఫలం.. యువతి బలవన్మరణం
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. శివాని, పరశురామ్‌కు ఆరు నెలల కిందటే పెళ్లి జరిగింది. భార్యపై అనుమానంతోనే పరశురామ్ ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే హత్యకు అసలు కారణం ఏమిటన్నది ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు. కుటుంబ కలహాలు, ఇతర కారణాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు.ఈ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన మహిళను కుటుంబ సభ్యులు, స్థానికులు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. మృతురాలు ఆరు నెలల గర్భిణి కావడంతో ఘటన మరింత విషాదాన్ని నింపింది.
Also Read:ఆళ్లపల్లిలో వ్యక్తి దారుణ హత్య
భార్యను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హత్యకు దారితీసిన పూర్తి కారణాలు, దంపతుల మధ్య గతంలో ఏమైనా వివాదాలు ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు.ఆరు నెలల గర్భిణి దారుణ హత్యకు గురికావడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. మద్యం మత్తులో జరిగిన గొడవ చివరకు ప్రాణాలు తీసే స్థాయికి చేరడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read:పోక్సో కేసులో మరో కలకలం.. బెదిరింపులతో బాలిక ఆత్మహత్యాయత్నం
