ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలంలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వెంకటాపురం సమీపంలో ఖమ్మం–దేవరాపల్లి నూతన జాతీయ రహదారిపై ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాద సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను బయటకు తీసుకొచ్చారు. అనంతరం వారిని చికిత్స కోసం ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యం అందుతున్నట్లు సమాచారం.
ప్రమాదానికి గల కారణాలు, మృతుల వివరాలు, క్షతగాత్రుల పరిస్థితిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
also read: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన లారీ, ఇద్దరు మృతి
