Homeక్రైమ్హోటల్ గదిలో ఎయిర్ ఇండియా కెప్టెన్ మృతి.. మిస్టరీగా మారిన ఘటన

హోటల్ గదిలో ఎయిర్ ఇండియా కెప్టెన్ మృతి.. మిస్టరీగా మారిన ఘటన

ముంబైకి చెందిన 40 ఏళ్ల ఎయిర్ ఇండియా కెప్టెన్ ఢిల్లీలోని ఓ హోటల్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. శుక్రవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

హోటల్ మేనేజర్, మృతుడి సోదరుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు హోటల్ గదికి చేరుకున్నారు. గది తలుపులు తెరిచి చూడగా కెప్టెన్ అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే కెప్టెన్ మృతికి ఖచ్చితమైన కారణం ఇప్పటివరకు తెలియరాలేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల అసలు కారణం స్పష్టమవుతుందని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

also read: అన్నను చూసేందుకు వచ్చిన చెల్లెలు.. భౌతికకాయం పక్కనే కుప్పకూలి మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు