ఖమ్మం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ముదిగొండకు చెందిన వినయ్ కుమార్ యాదవ్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వినయ్ కుమార్ యాదవ్ గతంలో ఓ పోక్సో కేసులో అరెస్టై మూడు నెలల పాటు జైలు శిక్ష అనుభవించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవలే అతడు జైలు నుంచి బయటకు వచ్చాడు.
అయితే జైలు నుంచి వచ్చిన తర్వాత కొందరు వ్యక్తులు వినయ్‌ను బెదిరించారని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా అతడి బైక్, సెల్‌ఫోన్‌ను తీసుకుని, కేసు ఉపసంహరించుకునేందుకు రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు వారు పేర్కొన్నారు.
ఈ వేధింపులతో తీవ్రంగా మనస్తాపానికి గురైన వినయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వినయ్ మృతికి కారణమైన వారిని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది.
also read: ప్రజ్వల్ రేవణ్న ఫోన్‌లో 140కి పైగా పోర్న్ వీడియోలు.. ఫోరెన్సిక్ రిపోర్టులో సంచలన విషయాలు
