క్రైమ్ మిర్రర్, సినిమా:- నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘దసరా’ మంచి విజయాన్ని అందుకోవడంతో, ఇప్పుడు వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు, టీజర్ సినిమాకు కావాల్సినంత హైప్‌ను తీసుకొచ్చాయి. ఈ చిత్రంలో కాయదు లోహార్, మంచు మోహన్ బాబు, రాఘవ్ జుయల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.అయితే ది ప్యారడైజ్ విషయంలో ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా భారీ సినిమాల విడుదలకు ముందు ట్రైలర్‌ను తప్పకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. కానీ ఈ సినిమాకు మాత్రం ట్రైలర్ ఉండదని నాని స్వయంగా వెల్లడించారు. దీంతో అసలు ఎందుకు ట్రైలర్ విడుదల చేయడం లేదనే ప్రశ్న అభిమానుల్లో మొదలైంది.
ఏషనాగుల సాంగ్‌పై విమర్శలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల!
నాని చెప్పిన వివరాల ప్రకారం.. సినిమా విడుదలకు సమయం చాలా తక్కువగా ఉండటంతో ట్రైలర్‌ను హడావుడిగా సిద్ధం చేయడం తమకు ఇష్టం లేదట. సినిమాలోని కంటెంట్‌కు తగ్గట్టుగా అద్భుతమైన ట్రైలర్‌ను రూపొందించాలంటే దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో పాటు చిత్రబృందం మరికొన్ని రోజులు ప్రత్యేకంగా దానిపై పని చేయాల్సి ఉంటుందని నాని తెలిపారు. అందుకు సమయం సరిపోకపోవడంతో ట్రైలర్‌ను విడుదల చేయకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు.మరోవైపు సినిమా షూటింగ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న కొన్ని వార్తలపై కూడా నాని స్పందించారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల షూటింగ్ సమయంలో ఎవరినైనా కొట్టారనే వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. అలాగే సినిమాలో భారీ అండర్‌వాటర్ యాక్షన్ సీక్వెన్స్, వెయ్యి మందితో ఫైట్ వంటి ప్రచారాలు కూడా వాస్తవం కాదని తెలిపారు.ఎలాంటి ట్రైలర్ లేకుండానే ది ప్యారడైజ్ నేరుగా థియేటర్లలో సందడి చేయనుండటం ఇప్పుడు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన.. విద్యార్థిని తల్లిదండ్రుల దాడి
