క్రైమ్ మిర్రర్ : తెలంగాణ ప్రభుత్వం నాన్-డెయిరీ, ఆర్టిఫిషియల్, అనలాగ్ పనీర్ ఉత్పత్తులపై నిషేధం విధించింది. ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 10, 2026 నుంచి నిషేధం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. నిషేధం పరిధిలోకి వచ్చే ఉత్పత్తుల తయారీ మాత్రమే కాకుండా వాటి ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ, సరఫరా, రవాణా, విక్రయాలపైనా ఆంక్షలు విధించారు. ఈ నిషేధం ఏడాది పాటు కొనసాగనుంది.
నిబంధనలను ఉల్లంఘించి నిషేధిత పనీర్ ఉత్పత్తులను తయారు చేసినా, విక్రయించినా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. అయితే చట్టబద్ధంగా, నిర్దేశిత ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తయారయ్యే ప్రామాణిక ఆహార ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
also read : అజ్ఞాతంలోకి కొండా దంపతులు…!
