Homeక్రైమ్ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో సూసైడ్ చేసుకున్న యువకుడు

ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో సూసైడ్ చేసుకున్న యువకుడు

నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవకాశం దక్కకపోవడంతో ఓ యువకుడు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రుద్రూర్ మండలం అంభం గ్రామానికి చెందిన సదానందం (24) ఈ ఘటనలో మృతి చెందాడు.

పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఉద్యోగం రావడం లేదన్న ఆవేదనతో సదానందం కొంతకాలంగా మానసికంగా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బుధవారం అలీసాగర్ రిజర్వాయర్ వద్దకు వెళ్లిన ఆయన ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

సదానందం మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చిన్న వయసులోనే అతడు ప్రాణాలు కోల్పోవడంతో అంభం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

also read: కేటీఆర్, హరీశ్ రావుపై లైంగిక వేధింపుల కేసు.. సైఫాబాద్ పీఎస్‌లో కేసు నమోదు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు