‘బేబీ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి వైష్ణవి చైతన్య.. ఇప్పుడు ఆనంద్ దేవరకొండతో కలిసి మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది.
ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఇప్పటికే సినిమాపై ఆసక్తి నెలకొనగా.. తాజాగా వైష్ణవి చైతన్య చిత్ర విశేషాలను పంచుకున్నారు.
‘బేబీ’, ‘ఎపిక్’ సినిమాలు రెండూ ఒకదానికొకటి పూర్తి భిన్నమైన చిత్రాలని వైష్ణవి తెలిపారు. ‘ఎపిక్’లో తన పాత్ర, సినిమా కథనం తనకు కొత్త అనుభూతిని ఇచ్చాయని చెప్పారు. ఈ సినిమాను ఛాలెంజింగ్‌గా భావించి పనిచేశామని పేర్కొన్నారు.
అంతేకాకుండా.. ‘ఎపిక్’ చూస్తున్న సమయంలో ప్రేక్షకులకు ‘బేబీ’ సినిమా గుర్తుకు రాకుండా చేయగలిగితే అదే తమకు పెద్ద విజయమని వైష్ణవి అభిప్రాయపడ్డారు. ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి తప్పకుండా మంచి ఆదరణ అందుకుంటుందనే నమ్మకం ఉందని చెప్పారు.
మరి ‘బేబీ’తో మెప్పించిన వైష్ణవి చైతన్య.. ‘ఎపిక్’తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో తెలియాలంటే సెప్టెంబర్ 11 వరకు వేచి చూడాల్సిందే.
also read: క్రైమ్ సీరియల్స్ చూసి హత్యకు స్కెచ్.. 25 రోజుల తర్వాత దంపతుల అరెస్ట్
