ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మంఝన్‌పూర్ మహిళా పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ప్రమాదవశాత్తు తుపాకీ పేలి ప్రాణాలు కోల్పోయారు.
పోలీసుల వివరాల ప్రకారం.. 28 ఏళ్ల ప్రియాంక యాదవ్ మంగళవారం ఉదయం పోలీస్ స్టేషన్‌లో విధుల్లో ఉన్నారు. ఈ సమయంలో ఆమె కుర్చీలో కూర్చుంటుండగా, ఆమె వద్ద ఉన్న సర్వీస్ రైఫిల్ నుంచి అకస్మాత్తుగా బుల్లెట్ పేలింది. ఈ ఘటనలో ప్రియాంక తీవ్రంగా గాయపడ్డారు.
వెంటనే అప్రమత్తమైన తోటి సిబ్బంది ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read: విషాదం.. విద్యుత్ షాక్‌తో రైతు మృతి
