Homeవైరల్తిరుపత్తూరులో వింత ఘటన.. ‘కరుప్ప స్వామి మా ఒంట్లో ఉన్నాడు’ అంటూ దంపతుల హల్‌చల్

తిరుపత్తూరులో వింత ఘటన.. ‘కరుప్ప స్వామి మా ఒంట్లో ఉన్నాడు’ అంటూ దంపతుల హల్‌చల్

తమలో దేవతా శక్తి ఉందంటూ ఓ దంపతులు నాలుగు రోజులుగా నగ్నంగా వీధుల్లో తిరగడం తమిళనాడులో కలకలం రేపింది. ఈ ఘటన తిరుపత్తూరు ప్రాంతంలో చోటుచేసుకున్నట్లు సమాచారం.

పళని(56), దీప(48) దంపతులు కొంతకాలంగా ఇంట్లో ప్రత్యేకంగా, వింతగా పూజలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో తమలో కరుప్ప స్వామి ఆవహించాడని వారు చెప్పడం ప్రారంభించారు. ఆ తర్వాత వరుసగా నాలుగు రోజుల పాటు గ్రామంలో నగ్నంగా తిరుగుతూ స్థానికుల దృష్టిని ఆకర్షించారు.

అంతేకాదు.. తమను ఎవరైనా అడ్డుకున్నా, వ్యతిరేకించినా తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ప్రజలను హెచ్చరించినట్లు సమాచారం. దీంతో ఆందోళనకు గురైన స్థానికులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.

ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి దంపతుల ప్రవర్తనకు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

also read: హైదరాబాద్‌లో లోన్‌ యాప్‌ దారుణం.. ఈఎంఐ కోసం బాలిక ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరింపులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు