సదాశివపేట మండలం సిద్ధాపూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అన్నను పాఠశాల నుంచి ఇంటికి తీసుకురావడానికి వెళ్లిన ఓ బాలుడు స్కూల్ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
స్థానికంగా తెలిసిన వివరాల ప్రకారం.. సిద్ధాపూర్‌కు చెందిన టైటస్ అనే విద్యార్థి స్థానిక జీనియస్ పాఠశాలలో చదువుతున్నాడు. అతడిని తీసుకొచ్చేందుకు అతడి తమ్ముడు ఎప్రాయిమ్ స్కూల్ బస్‌స్టాప్ వద్దకు వెళ్లాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన పాఠశాల బస్సు బాలుడిని ఢీకొట్టింది.
ప్రమాదంలో ఎప్రాయిమ్ బస్సు కింద పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలంలోనే బాలుడు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, ప్రమాదానికి గల కారణాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
also read: మైనర్ బాలికపై అత్యాచార యత్నం.. యువకుడిని పట్టుకున్న స్థానికులు
