క్రైమ్ మిర్రర్ : హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది.
లోటస్ హాస్పిటల్ వెనుక భాగంలో కొంతకాలంగా డ్రైనేజీ పైప్‌లైన్‌లో సమస్య ఏర్పడి నీటి ప్రవాహానికి అంతరాయం కలుగుతోంది. దీంతో స్థానికులు జలమండలి సిబ్బందికి సమాచారం అందించారు. సమస్యను పరిష్కరించేందుకు మ్యాన్‌హోల్ మూత తెరిచిన సిబ్బందికి అందులో శిశువు మృతదేహం కనిపించింది.
వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని వెలికితీసి, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నవజాత శిశువు మృతదేహాన్ని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో పడేసి ఉంటారా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. శిశువు మృతదేహం అక్కడికి ఎలా చేరిందనే విషయంపై ఆధారాలను సేకరిస్తున్నారు.
also read : నీటి కోసం పాక్ సైన్యంలో ఘర్షణ.. 22 మందికి గాయాలు
ChatGPT is A
