Homeక్రైమ్జగిత్యాల– ధర్మపురి రోడ్డుపై ఘోర ప్రమాదం.. యువకుడు మృతి

జగిత్యాల– ధర్మపురి రోడ్డుపై ఘోర ప్రమాదం.. యువకుడు మృతి

జగిత్యాల– ధర్మపురి ప్రధాన రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కల్లెడ గ్రామ సమీపంలో ఓ స్విఫ్ట్ డిజైర్ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

కారులో మొత్తం నలుగురు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం ధాటికి ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

గాయపడిన వారు మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలానికి చెందినవారిగా గుర్తించినట్లు సమాచారం. ప్రమాదం ఎలా జరిగింది? కారు అదుపుతప్పడానికి కారణమేంటి? అనే విషయాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

also read: బాలయ్య ‘దాదా’లో మంచు మనోజ్.. విలన్‌గా మరోసారి మాస్ ట్రీట్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు